కాలం మారే కొద్ది హైదరాబాద్ కల్చర్ కూడా బాగా పెరిగిపోయింది.. సినిమాలు పెరుగుతున్నా దానికన్నా ఘోరంగా ఇక్కడి వాతావరణం పూర్తిగా మారిపోయింది..మరీ దారుణంగా యువత ప్రవర్తిస్తున్నారు. అదే ఇప్పుడు ఈ హైదరాబాద్ మహానగరంలో ట్రెండ్ అవుతుంది..అందుకే యువత చెడిపోతుంది.. ఇకపోతే ఈ మధ్య రెచ్చిపోయి యువత ప్రవర్తిస్తున్నారు..అసలేం జరుగుతోంది అనేది ఎవరికి అంతుచిక్కడం లేదు..

 

హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు.. ఏంటంటే భూతూ సినిమాలకు మించి ఇక్కడ బాగోతాలు చేస్తున్నారట.. అదికూడా వివస్త్ర గా నృత్యాలు చేస్తూ యువతను తప్పు దారి పట్టిస్తున్నరట.. ఈ విషయం తెలుసుకున్న ఎక్సైజ్‌ అధికారులు దాడులు చేశారు... పబ్ లో ప్రత్యక్షంగా చూసి వారిని పట్టుకున్నరట.. అలా సినిమా తరహాలో చర్యలు జరుగుతున్నాయి.. వివరాల్లోకి వెళితే..

 

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని టోట్ పబ్‌పై ఎక్సైజ్‌ అధికారులు దాడులు చేశారు. ముజ్రా పార్టీ జరుగుతోందనే సమాచారంతో  తనిఖీలు నిర్వహించారు. పబ్‌లో నగ్న నృత్యాలు నిర్వహిస్తున్నారని అధికారులకు సమాచారం అందింది. 22మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టోట్‌ పబ్‌లో ఓ ప్రైవేటు సంస్థ ముజ్రా పార్టీ ఏర్పాటు చేసింది. నగ్న నృత్యాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో మరికొన్ని పబ్‌ల్లోనూ తనిఖీలు చేస్తున్నారు. అక్కడ కూడా భారీ స్థాయిలో ఈ దందా నడుస్తుండగా అధికారులు కట్టడి చేశారు.


అయితే అక్కడ చాలా మొత్తంలో అక్రమంగా మద్యాన్ని నిల్వ చేశారనే సమాచారంతో ఎక్సైజ్​ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పలు మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇళ్ల మధ్యలో  ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 22 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: