కావాల్సిన ప‌దార్థాలు:
ఓట్స్- రెండు కప్పులు
నూనె- అర టీ స్పూన్
ఆవాలు- టీ స్పూన్
ఉప్పు- తగినంత

 

ఈనో ఫ్రూట్‌ సాల్ట్‌- చిటికెడు
పచ్చిమిర్చి- రెండు
కొత్తిమీర- టేబుల్‌ స్పూన్
పసుపు- చిటికెడు

 

సెనగపప్పు- అర టేబుల్ స్పూన్
క్యారెట్‌ తురుము- రెండు టేబుల్‌ స్పూన్లు
మినప్పప్పు- టేబుల్ స్పూన్
పుల్లటి పెరుగు- రెండు కప్పులు

 


తయారీ విధానం:
ముందుగా ప్యాన్ లో ఓట్స్‌ వేసి కాస్త రంగు మారేవరకూ వేయించాలి. తర్వాత అవి వేడి తగ్గాక మిక్సీలో వేసి పొడి చెయ్యాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేసి, నూనె వెడెక్కాక ఆవాలు, మినప్పప్పు, సెనగపప్పు వేసి వేయించాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర తురుము, క్యారెట్‌ తురుము, పసుపు వేసి ఓ నిమిషం వేగాక దించి ఓట్స్‌ పొడిలో కలపాలి.

 

ఆ మిశ్రమంలో పెరుగు, తగినంత ఉప్పు వేసి కలిపి ఇడ్లీ మిశ్రమంలా చేయాలి. ఇప్పుడు మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేట్లలో వేసి దాదాపు 15 నిమిషాలు ఉడికించాలి. అంతే వేడి వేడి ఓట్స్ ఇడ్లీలు రెడీ. వీటిని చట్నీతో తింటే అద్భుతంగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: