మనిషి జీవితం అమ్మ చుట్టే అల్లుకు పోతుంది. తొలి అడుగు వేసినప్పటి నుంచి జీవితంలో ఎన్ని అడుగులు వేసినా అమ్మే తొలి గురువు. చిన్నప్పటి నుంచి మా అమ్మతో నా అనుబంధం లోని చిరు ఙ్ఞాపకాల పందిరి....అమ్మ కాలం చేసి ఎన్ని సంవత్సరాలు గడిచినా అమ్మతో అనుబంధం ఎప్పటికీ మరువలేనిది. అమ్మే నా స్నేహితురాలు. స్కూల్లో జరిగే ప్రతి విషయమూ రాగానే చెప్పేదాన్ని. ఒకవేళ చ‌నిపోయిన అమ్మ కలలో కనిపిస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలని పంచాంగ నిపుణులు అంటున్నారు. చనిపోయిన వారు కలలో రావడం ఒకందకు మేలైనప్పటికీ, చాలా వరకూ హెచ్చరించేందుకు కలలో ఇలా కనబడతారని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. త‌ల్లి మ‌న ముందు ఉన్నా చ‌నిపోయినా ఎక్క‌డ ఉన్నా కూడా ఏత‌ల్లైనా పిల్ల‌ల బాగే కోరుకుంటుంది. అందుకే అమ్మ అంటారు. మరణించిన తల్లి కలలో కనిపస్తే ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోమని, అలాగే తోటివారితో జాగ్రత్తగా ఉండాలనే సంకేతాలిస్తున్నట్లు అర్ధం చేసుకోవాలి. మనకు బాగా దగ్గరైన వారు కానీ చనిపోయిన వారు కానీ కలలో కనిపిస్తే..కొన్ని ఇబ్బందులు తలెత్తే ఆస్కారం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. 

 

సమస్యల నుండి బయట పడటానికి వ్యక్తిగతంగా సరైన నిర్ణయాలు, సలహాలను పాటించాలని కలలో కనిపించన అమ్మ సూచిస్తున్నట్లుగా ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. మహిళలకు కలలో అమ్మ కనబడితే, గర్భధారణకు ఇది మంచి సమయం అని సూచిస్తున్న‌ట్లు చెబుతున్నారు. తల్లి మళ్లీ పుట్టడానికి సంకేతమని అర్థం. పురుషులకు కలలో కనబడితే, తన తోటి మహిళలు, లేదా పాట్నర్ కు రెస్పెక్ట్ ఇవ్వమని సూచిస్తుంది. ఐడియల్ గా , ఫెమైన్ గా జీవించమని తాను చూచిస్తున్న‌ట్లు పండితులు చెబుతున్నారు. మనతో ఉన్నవారు, మన నుంచి దూరమయ్యాక మనకు ఏర్పడే కష్టనష్టాలను గురించి ముందుగా హెచ్చరించేందుకు కలలో వస్తారని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. 

 

ఇంకా చనిపోయిన వ్యక్తులు మీకు కలలో కనిపిస్తున్నట్లైతే మీరు ఆనందాన్ని, జీవనాన్ని కోల్పోతున్నట్లు, సరైన ఆలోచనధోరణిలా వెళ్లకుండా, ఏదో కీడు మిమ్మల్ని శంకిస్తున్నట్లు అర్థమని సమాచారం. చనిపోయిన వ్యక్తితో మాట్లాడుతున్నట్లు కలలో వస్తే ఎప్పుడూ ఆ భాదను దిగమింగుకోలేక, ఎంతో వ్యధను దు:ఖాన్ని అనుభవిస్తున్నారని అర్ధం చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: