సంక్రాంతి మూడు రోజుల పండుగలో చివరి రోజు రేపు.. కనుమ పండుగ. ఆ కనుమ పండుగా స్పెషల్ గా నాటుకోడి పులుసు తినండి.. అది ఎలా చెయ్యాలో ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కావాల్సిన పదార్ధాలు..

 

నాటు కోడి మాంసం - 750 గ్రాములు, 

 

కారం - మూడు టీ స్పూన్లు, 

 

పసుపు - తగినంత, 

 

అల్లంవెల్లుల్లి ముద్ద - మూడు టీ స్పూన్లు, 

 

నూనె - తగినంత, 

 

కరివేపాకు - క్కలు - 325 గ్రాములు, 

 

రెండు రెబ్బలు, 

 

ఉల్లిపాయము

 

కాశ్మీర్‌ కారం పొడి - రెండు టీ స్పూన్లు, 

 

మసాల పొడి - నాలుగు టీ స్పూన్లు, 

 

ఉప్పు - తగినంత, 

 

కొత్తిమీర - ఒక కట్ట.

 

తయారీ విధానం... 

 

నాటు కోడి మాంసాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి అందులో కొద్దిగా పసుపు, కారం, అల్లంవెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయ ముద్ద, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. రెండు గంటల తర్వాత స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టి సరిపడా నూనె వేసి బాగా కాగాక కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయంచుకోవాలి. ఇప్పుడు మసాలా పొడి, కారం, ఉప్పు, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్‌ ముక్కలు కూడా వేసి ఎర్రగా వేగనివ్వాలి. రెండు కప్పుల నీళ్లు పోసి మరో పదినిమిషాలు ఉడకనివ్వాలి. కొత్తిమీరతో అలంకరించుకుంటే నాటుకోడి పులుసు తయారయినట్టే. చూశారుగా.. ఈ నాటుకోడి పులుసుని కనుమ స్పెషల్ గా చేసుకుని తినండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: