మహిళల్లో రుతుస్రావం ఆగిపోయే దశను మెనోపాజ్ అంటారు. సాధారణంగా మెనోపాజ్‌ అనేది 40-50 సంవత్సరాల మధ్య వస్తుంది. మారిన ఆహారపు అలవాట్లు,జీవన విధానంతో కొంతమంది మహిళల్లో 40 ఏళ్లకు ముందుగానే మెనోపాజ్ వస్తోంది. దీన్ని ప్రీ మెనోపాజ్ అంటారు. అయితే తరుచూ శృంగారంలో పాల్గొనేవారిలో మెనోపాజ్ దశ కాస్త ఆలస్యంగానే వస్తుంది. మెనోపాజ్ ద‌శ‌లో మాన‌సిక ఆందోళ‌న‌కు గుర‌వుతారు.స్త్రీలను మోనోపాజ్ దశ ఎంతగానో వేధిస్తుంది. 50ఏళ్ల వరకు పీరియడ్స్ కొనసాగడం వల్ల స్త్రీల ఆరోగ్యం బాగుంటుంది. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల స్థూలకాయం కూడా వస్తుంది. నడి వయసు కి వచ్చినా కూడా స్త్రీలు శృంగారంలో చురుకుగా పాల్గొనాలని నిపుణులు చెబుతున్నారు.ఆ వయసులోనూ శృంగారంలో చురుకుగా పాల్గొంటూ ఎంజాయ్ చేస్తేనే.. మెనోపాజ్ దశకు చేరుకునే సమయం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

 

మెనోపాజ్ వచ్చే ముందు పీరియడ్స్ తేదీల్లో మార్పు వస్తుంది. సాధారణంగా 28రోజులకు ఒకసారి రావల్సిన పీరియడ్‌.. కాస్త ఆలస్యంగా లేదా ముందుగానే రావడం జరుగుతుంది. కొంతమంది నెలసరి రావడంలో తేడా ఉన్నా రక్తస్రావం తక్కువగా ఉంటుంది. కొంత కాలం తర్వాత వీరిలో మెనోపాజ్‌ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక కొంతమందికి నెలసరి ముందుగా లేదా ఆలస్యంగా రావడంతో పాటు రక్తస్రావం కూడా ఎక్కువవుతుంది.

 


మెనోపాజ్ దశలో శరీరం వేడిగా ఉండటం,ఆవిర్లు రావడం జరుగుతుంది. మెనోపాజ్‌ రావడానికి కొన్ని సంవత్సరాల ముందు నుంచే ఈ లక్షణాలు కనిపించవచ్చు. కొంతకాలానికి ఈ సమస్య తగ్గిపోతుంది. మెనోపాజ్ దశలో 75శాతం మంది ఈ సమస్యతో బాధపడ్తారు. మెనోపాజ్ కారణంగా యోని మార్గం పొడిగా మారడం, ఇన్ఫెక్షన్స్‌ రావడం, కలయిక బాధాకరంగా ఉండటం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: