చికెన్ కర్రీ.. ఎలా చేసిన తింటారు ఆహార ప్రియులు.. అయితే అలాంటి చికెన్ ముక్కలను.. మనం ఆలా ఇలా అని ఎన్నో రకాలుగా చేసుకొని.. తింటాము.. అయితే ఈ చికెన్ కర్రీని ఎలా కొబ్బరి పాల చికెన్ కర్రీ ఎలా చేయాలో తెలుసా ? ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా ? అయితే అలాంటి అద్భుతమైన చికెన్ కర్రీని ఎలా చేయాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. ఇంట్లో ప్రయత్నించండి.. 

 

కావలసిన పదార్థాలు...

 

చికెన్‌- ఒక కేజీ, 

 

పెరుగు- అర కప్పు, 

 

కొబ్బరిపాలు- ముప్పావు కప్పు, 

 

నిమ్మరసం- ఒక టీ స్పూను, 

 

పసుపు- పావు టీ స్పూను, 

 

దనియాల పొడి- ఒక టేబుల్‌ స్పూను, 

 

జీలకర్ర పొడి- పావు టీ స్పూను, 

 

కారం- రెండు టీ స్పూన్లు, 

 

గసగసాలు- ఒక టీ స్పూను, 

 

పాలు- ఒక టీ స్పూను, 

 

తరిగిన ఉల్లిపాయలు- రెండు, 

 

గరం మసాలా- ఒక టీ స్పూను, 

 

అనాస పువ్వు- ఒకటి, 

 

దాల్చిన చెక్క- చిన్న ముక్క, 

 

కొత్తిమీర- రెండు స్పూన్లు, 

 

నూనె- రెండు స్పూన్లు, 

 

అల్లంవెల్లుల్లి ముద్ద- రెండు టీ స్పూన్లు, 

 

తరిగిన పచ్చిమిర్చి- ఒక టీ స్పూను, 

 

ఉప్పు- తగినంత.

 

తయారీ విధానం... 

 

చికెన్‌ను కడిగి పెరుగు, దనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, నిమ్మరసం, సగం అల్లంవెల్లుల్లి ముద్ద వేసి కలిపి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. పాలల్లో గసగసాలు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. కుక్కర్‌లో నూనె పోసి వేడెక్కాక అనాస పువ్వు, దాల్చిన చెక్క, ఉల్లిపాయలు వేసి వేగించాలి. తర్వాత మిగిలిన అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి, కారం వేసి వేగించాలి. ఆ తర్వాత నానబెట్టిన చికెన్‌ వేసి బాగా కలిపి 5 నిమిషాలు పెద్దమంట మీద ఉడకనివ్వాలి. తర్వాత ఉప్పు, గసగసాల ముద్ద వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత గరంమసాలా, కొబ్బరిపాలు వేసి బాగా కలిపి మరో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతే టేస్టీ టేస్టీ కొబ్బరిపాల చికెన్ రెడీ.. 

మరింత సమాచారం తెలుసుకోండి: