పెళ్లి అనేది నూరేళ్ళ పంట.. ఈ పెళ్లి అనేది ఆడ మ గ మాత్రమే ఈ పెళ్లి అనే బంధంతో ఒక్కటవుతారు..అలా మూడుముళ్ల బంధంతో ఒకే గూటికి చేరుతారు.. అయితే ఇక్కడ విచిత్రం జరిగింది.. ఒక మగాడు మరో మగాడిని పెళ్లి చేసుకున్నాడట.. అది కూడా పెళ్ళైయ్యాక కొద్ది రోజులకు బయట పడిందట అసలేం జరిగింది అనేది వివరాల్లోకి వెళితే ..

 

మహమ్మద్ ముతుంబా అనే వ్యక్తి రెండు వారాల కిందట స్వబుల్లా నబుకీరాను సాంప్రదాయకంగా నిఖా చేసుకున్నాడు. ఈ సందర్భంగా పెళ్లి ఒప్పందంపై సంతకాలు చేశారు. అయితే, వధువుకు రుతుక్రమం వల్ల పెళ్లి కుమార్తెను చూడటం అతడికి సాధ్యం కాలేదు... దానితో పెళ్లి అయితే చేసుకున్నాడు.. అప్పటి నుండి ఇరుగు పొరుగు వారితో అనేక సమస్యలు వచ్చేవట..

 

అయితే, ముతుంబా పొరుగింటివారికి అతడి భార్య మహిళ కాదనే అనుమానం కలిగింది. నబుకీరా గోడదూకి పొరిగింట్లోని టీవీ, దుస్తులు తదితర వస్తువులను దొంగిలించడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ముతుంబా, నబుకీరా పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఓ మహిళా పోలీస్ అధికారి నబుకీరాను పరీక్షించింది. బ్రాలో గుడ్డముక్కలను చూసి ఆ అధికారిని షాకైంది. నుబుకీరా మహిళ కాదని, పురుషడని పేర్కొంది.

 

ఈ విషయం పై అతను ఏ మాత్రం ఆరా తీయలేదట..హిజాబ్ ధరించిన అమ్మాయిని కలిశాను. ఆమె నాతో పెళ్లికి అంగీకరించింది. అయితే, పెళ్లి కూతురికి ఇచ్చే కట్నం అందేవరకు సెక్స్ వద్దని కండీషన్ పెట్టింది. దీనికి నేను అంగీకరించిన తర్వాతే పెళ్లి ఒప్పందం జరిగింది. మా పొరిగింటివాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేసేవరకు తాను మహిళ అనే అనుకున్నాను’’ అని తెలిపాడు. డబ్బుకు ఆశ పడే ఆ వ్యక్తి ఇలా వధువు వేషంలో మోసం చేయడానికి ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు... అతను ఎందుకు అమ్మాయిలాగా మారాడు అన్న విషయం తెలియాల్సి ఉంది .

మరింత సమాచారం తెలుసుకోండి: