దొండకాయ ఫ్రై.. ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా ? అలాంటిది దొండకాయ ఉల్లికారం ఇంకా ఎంత అద్భుతం ఉంటుంది తెలుసా?  ఉల్లిపాయ ప్రస్తుతం కాస్టలీ ఉంటుంది. అయినా పర్లేదు దొండకాయ ఉల్లికారం అద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం దొండకాయ ఉల్లిపాయ ఎలా చేసుకోవాలో ఇక్కడ చదివి తెలుసుకోండి. 
 


కావలసిన పదార్థాలు... 

 

దొండకాయలు - పావుకిలో, 

 

పెద్ద ఉల్లిపాయలు - 2, 

 

జీలకర్ర - 1 టీ స్పూను, 

 

ఎండుమిర్చి - 4, 

 

నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, 

 

పసుపు - చిటికెడు, 

 

శనగపిండి - 1 టేబుల్‌ స్పూను, 

 

ఉప్పు - రుచికి సరిపడా.

 

తయారుచేసే విధానం...

 

దొండకాయలకు నిలువుగా గాట్లు పెట్టుకోవాలి. జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని నూనెలో వేగించి ముద్దలా నూరుకోవాలి. పసుపు, ఉప్పు, ఉల్లిపాయ మిశ్రమం బాగా కలిపి దొండకాయల్లో కూరాలి. తర్వాత కూరిన దొండకాయల్ని నూనెలో సన్నని మంటపై ఉడికించాలి. దించేముందు శనగపిండి చల్లి మరో 5 నిమిషాలు ఉంచి దించేయాలి. అంతే దొండకాయ ఉల్లికారం రెడీ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: