కావాల్సిన ప‌దార్థాలు:
రొయ్యలు- పావుకిలో
మిరియాల పొడి- చిటికెడు
బియ్యప్పిండి- 2 టేబుల్‌ స్పూన్లు

 

జీలకర్ర పొడి- అర టీ స్పూను చొప్పున
పంచదార- అర టీ స్పూను
నూనె- వేగించడానికి సరిపడా

 

ఉప్పు- రుచికి తగినంత
శనగపిండి- పావుకిలో
ధనియాల పొడి- అర‌టీ స్పూన్‌

 

తయారీ విధానం:
ముందుగా రొయ్యల‌ను శుభ్రం చేసి నీటిలో క‌డిగి ప‌క్క‌న పెట్టుకోవాలి. తర్వాత పంచదార, మిరియాలపొడి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో శనగ పిండి, బియ్యప్పిండి, ఉప్పు, ధనియాలపొడి, జీలకర్ర పొడి వేసి తగినంత నీరు పోస్తూ జారుగా కలపాలి. మ‌రోవైపు స్టై మీదు పాన్ పెట్టి నూనె వేసి వేడి చేయాలి. ఇప్పుడు రొయ్యల‌ను పట్టుకుని.. పిండి జారులో ముంచి నూనెలో వేయాలి. 

 

అవి దోర‌గా వేగాక స‌ర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుంటే స‌రిపోతుంది. అంతే క‌్రిస్పీ క్రిస్పీ రొయ్య‌ల బ‌జ్జీ రెడీ. వీటిని ఏదైనా సాస్‌తో వేడివేడిగా తింటే ఆ రుచే వేరు. రొయ్య‌లు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే కొంద‌రు వీటితో చేసిన క‌ర్రీ తినడానికి ఇష్ట‌ప‌డ‌రు. అలాంటి వారికి ఇలా చేసిపెడితే ఖ‌చ్చితంగా లాగించేస్తారు. సో.. త‌ప్ప‌కుండా ట్రై చేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: