చికెన్ కర్రీ.. ఎలా చేసిన తింటారు ఆహార ప్రియులు.. అయితే అలాంటి చికెన్ ముక్కలను.. మనం ఆలా ఇలా అని ఎన్నో రకాలుగా చేసుకొని.. తింటాము.. అయితే ఈ చికెన్ కర్రీని ఎలా అరబిక్‌ స్టయిల్‌ లో చికెన్‌ కర్రీ ఎలా చేయాలో తెలుసా ? ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా ? అయితే అలాంటి అద్భుతమైన అరబిక్‌ స్టయిల్‌ చికెన్‌ కర్రీని ఎలా చేయాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. ఇంట్లో ప్రయత్నించండి.. 

 

కావాల్సిన పదార్థాలు.. 

 

బోన్‌లెస్‌, స్కిన్‌లెస్‌ చికెన్‌- 1కే.జి, 

 

నూనె - 5 టేబుల్‌ స్పూన్లు, 

 

ఉల్లిపాయలు - 2,

 

వెల్లుల్లి రేకలు - 4, 

 

అల్లం ముద్ద - 1 టేబుల్‌స్పూన్‌, 

 

పసుపు - 1 టేబుల్‌స్పూన్‌, 

 

పచ్చిమిర్చి - 2, 

 

ఆల్మండ్స్‌ - 1/2 కప్పు, 

 

ఎండుద్రాక్ష - 1/2 కప్పు,

 

టమాట - 4, 

 

నిమ్మరసం- తగినంత, 

 

ఉప్పు- తగినంత

 

తయారీ విధానం... 

 

చికెన్‌ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ప్రెషర్‌పాన్‌లో నూనెవేసి వేడిచేసి ఉల్లిపాయలు, వెల్లుల్లి వేయించుకోవాలి. తర్వాత ఆల్మండ్స్‌, అల్లం, పసుపు, కారంపొడి, పచ్చిమిర్చి వేసి నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు చికెన్‌ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. దీనికి ఎండుద్రాక్ష, టమాటో, నిమ్మరసం, కప్పు నీరు కలిపి సన్నని సెగమీద ఉడికించాలి. తగినంత ఉప్పువేసి ఐదు నిమిషాలు ఉంచి దించుకోవాలి. వేడివేడి అన్నంతో ఈ కర్రీని వడ్డించడమే తరువాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: