పసి పిల్ల‌లు త‌ల్లి కాసేపు క‌నిపించ‌క‌పోయినా ఏడుస్తారు. ఎందుకంటే వాళ్ళ‌కి ముందు త‌గిలే స్ప‌ర్శ త‌ల్లిదే. ఆ త‌ల్లి లేక‌పోతేవారు అభ‌ద్రతా భావ‌న ఫీల‌వుతారు. ఎప్పుడూ త‌ల్లి ఒడిలో ఉండే పిల్ల‌లు కాసేపు ఆ త‌ల్లి క‌న‌ప‌డ‌క‌పోయే స‌ర‌కి భ‌య‌ప‌డి ఆందోళ‌న చెందుతారు. అమ్మ కోసం ఏడ్చేస్తారు. నాన్న క‌నిపించ‌క‌పోయినా ప‌ర్వాలేదు కాని అమ్మ మాత్రం ఎప్పుడూ వాళ్ళ క‌ళ్ళ‌ముందే ఉండాలి. త‌ల్లీ బిడ్డ‌ల సంబంధం అలాంటిది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఓ కొత్త టెక్నిక్‌ని క‌నిపెట్టింది ఓ త‌ల్లి.

 

తాను ప‌క్క‌న లేని స‌మ‌యాల్లో బిడ్డ ఏడ‌వ‌కుండా త‌న‌వి పెద్ద పెద్ద క‌టౌట్లు త‌యారు చేయిస్తోంది. ఏదైన ప‌నిమీద త‌ను బిడ్డ‌కు ద‌గ్గ‌ర‌గా లేన‌ప్పుడు ఆ బిడ్డ ఏడ‌వ‌కుండా ఉండ‌టానికి.. ఓ తల్లి ఓ ఐడియా వేసింది. అదే పెద్ద కటౌట్లు తయారు చేయించింది. ఇది జ‌పాన్‌లో జ‌రిగింది. జపాన్‌కు చెందిన ఓ మహిళకు ఏడాదిన్నర పిల్లాడున్నాడు. అమ్మను విడిచి అసలు ఉండడు. 

 

దీంతో తల్లిదండ్రులు రెండు కటౌట్లకు ఆర్డర్ చేశారు. ఒకటి తల్లి నిలబడి ఉన్నట్లుగా..మరొకటి అమ్మ కూర్చున్నట్లు తయారు చేయించారు. కూర్చొన్న కటౌట్‌ను హాల్‌లోనూ...నిలబడి ఉన్న కటౌట్‌ను కిచెన్‌లో పెట్టి తల్లి వేరే పనులు చేసుకుంటోంది. ఆ కటౌట్లు చూసి ఆ పిల్లాడు నిజంగా అమ్మ అక్కడే ఉందని అనుకుంటూ త‌న త‌ల్లికి ఏ ప‌నికీ అడ్డురాకుండా త‌ల్లి త‌న ద‌గ్గ‌రే ఉన్న‌ట్లు భావించి చక్కగా ఆడుకుంటున్నాడు. చక్కగా బొమ్మలతో ఆడుకుంటున్నాడు. ఒక 20 నిమిషాల వరకు ఆ బిడ్డ తన తల్లిని కటౌట్ల రూపంలో చూసి ఏడవకుండా ఆడుకుంటున్నాడు. అమ్మ తనదగ్గరే ఉందని ఫీలవుతున్నాడు. ఈ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి సోష‌ల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి ఓత‌ల్లి నీకు జోహార్లు అంటూ ర‌క‌ర‌కాల కామెంట్లు వ‌స్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: