అమ్మ మీద ప్రేమ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆ ప్రేమ‌ని అనుభ‌వించ‌ని వారు ఈ సృష్టిలో ఎవ్వ‌రూ ఉండ‌రు. అందుకే అమ్మ ప్రేమ మీద ఎన్ని సినిమాలు తీసినా... ఎన్ని పాట‌లు రాసిన అన్నీకూడా హిట్ అయ్యాయ‌నే చెప్పాలి. ఎప్పుడూ కూడా త‌ల్లి త‌న పిల్ల‌ల‌ను భారంగా అనుకోదు. బిడ్డ‌కి ఎంత పెద్ద‌ క‌ష్ట‌మొచ్చినా కూడా త‌న క‌ష్టంగా భావించి బిడ్డ‌కు క‌ష్టం క‌ల‌గ‌కుండా చూసుకుంటుంది. పిల్ల‌ల ఎదుగుద‌ల కోసం త‌ల్లి త‌న జీవితాన్నే కొవ్వొత్తిలా వెలిగించి తాను క‌రిగిపోతూ ఉంటుంది. 


జీవితంలో తొలి గురువు అయిన అమ్మ విలువను, ఆమె లేనిలోటు, అమ్మ ఉంటే ప్రయోజనాలు ఇలా ఎన్నో విషయాలను తెలిపే కొన్ని మధురమైన అమ్మ పాటలు మీకోసం. ‘అమ్మను మించి దైవమున్నదా....జగమే పలికే శాశ్వత సత్యమిదే అందరిని కనే శక్తి అమ్మ ఒక్కతే అంటూ ప్రముఖ రచయిత సి. నారాయణ రెడ్డి అమ్మ విలువను తనకు తోచిన రీతిలో మనకు కమ్మనైన పాట రూపంలో అందించారు.

 

‘ఎవరు రాయగలరూ అమ్మ అను మాటకన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరూ అమ్మ అనురాగం కన్న తీయని రాగం’ అంటూ అమ్మ అనే పదానికి మించిన కావ్యం లేదంటూ మాతృమూర్తుల కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి తన కలాన్ని పారించారు. ఇలా ర‌క ర‌కాల అమ్మ‌పాట‌లు ఎన్నో ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. నాని చిత్రంలో అమ్మ‌పాట పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ.. అమ్మలేని లోటు తెలిపే ‘అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా’.. బాహుబ‌లి చిత్రంలో పాట ఇవ‌న్నీ అమ్మ ప్రేమ‌ను చాటి చెప్పేవే. 

మరింత సమాచారం తెలుసుకోండి: