కొబ్బరి చేపల పాల కూర ఎప్పుడైనా తిన్నారా? ఎంత బాగుంటుందో తెలుసా? అసలు ఈ పేరు వినిందే ఇప్పుడు అని అనుకుంటున్నారు కదా? కానీ తినడానికి అద్భుతంగా ఉంటుంది. అయితే ఇలాంటి కొబ్బరి చేపల పాల కూర ఎలా చెయ్యాలో ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కావలసిన పదార్థాలు.. 

 

చేపముక్కలు - అర కేజి, 

 

కొబ్బరిపాలు - అర కప్పు, 

 

టమోటా గుజ్జు - 1 కప్పు, 

 

ఉల్లిపాయలు - 4, 

 

అల్లం తరుగు - 1 టీ స్పూను, 

 

వెల్లుల్లి తరుగు - 1 టీ స్పూను, 

 

పచ్చిమిర్చి - 2, 

 

కరివేపాకు - గుప్పెడు, 

 

ఆవాలు - 1 టీ స్పూను, 

 

మెంతులు - 1 టీ స్పూను, 

 

పసుపు - పావు టీ స్పూను, 

 

కారం - 2 టీ స్పూన్లు, 

 

దనియాలపొడి - 1 టీ స్పూను, 

 

నీరు - 1 కప్పు, 

 

ఉప్పు - రుచికి తగినంత, 

 

నూనె - 2 టేబుల్‌ స్పూన్లు.

 

తయారీ విధానం... 

 

కడాయిలో ఆవాలు, మెంతులు, అల్లం, వెల్లుల్లి, ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు (సగం), పసుపు, కారం, దనియాలపొడి ఒకదాని తర్వాత ఒకటి వేగించి, టమోటా గుజ్జు కలపాలి. 10 నిమిషాల తర్వాత చేపముక్కలు, నీరు కలిపి ముక్కలు ముప్పావు భాగం ఉడికిన తర్వాత కొబ్బరిపాలు, ఉప్పు వేసి సన్నని మంటపై ఉంచాలి. కూర చిక్కబడ్డాక మిగిలిన కరివేపాకు వేసి మూతపెట్టాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: