సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ కులాల వారి కోసం ప్రభుత్వం ఫ్యాషన్ డిజైనింగ్లో ఉచిత శిక్షణ అందిస్తోంది. కేంద్రప్రభుత్వ జాతీయ ఎస్టీ, ఎస్టీ హబ్ సౌజన్యంతో ఫ్యాషన్ డిజైనింగ్ లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు.

 

ఇది ఎక్కడ అంటారా.. హైదరాబాద్ లోని యూసుఫ్ గూడలో జాతీయ సూక్ష్మ,మధ్యతరహా, లఘుపరిశ్రమల కేంద్రం..నిమ్స్ మేలో ఈ అవకాశం కల్పిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ యువతకు నెల రోజుల పాటు శిక్షణ ఉంటుంది.

 

ఈ ట్రైనింగ్ లో థియరీ, ప్రాక్టికల్స్ తరగతులు నిర్వహిస్తారు. ఈ ట్రైనింగ్ కు పదో తరగతి ఉత్తీర్ణులైన 18 నుంచి 40 ఏళ్ల లోపు వయసున్న వారు అర్హులు. ఆసక్తి ఉన్నవారు విద్యార్హత ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, 2 పాస్ పోర్టు సైజ్ ఫొటోలతో దరఖాస్తు చేసుకోవచ్చు

 

శిక్షణ పూర్తయిన అనంతరం ధ్రువీకరణ పత్రాలు కూడా అందిస్తారు. ఇంకా వివరాలు కావాలంటే.. 91213 36565 నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఈ సమాచారం మీకు ఉపయోగపడవచ్చు. పడకపోవచ్చు. కానీ దీన్ని మీ వాట్సప్ గ్రూపుల్లోనూ, ఫేస్ బుక్ లోనూ పోస్టు చేయండి. అవసరమైన వారికి ఇది ఉపయోగపడుతుంది. మనం అనవసరంగా ఎన్నో పోస్టులు ఫార్వార్డ్ చేస్తుంటాం. ఇలా పనికొచ్చి ఉద్యోగ సమాచారం పంపితే ఎవరికైనా ఉపయోగపడొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: