ఆనాటి కాలం లో భార్య భర్తలు అంటే ఒక చిలక గోరింకలు అంటారు. ఇకపోతే పతియే ప్రత్యక్ష దైవం అని ఒకప్పుడు పూజలు చేసేవారు అని సినిమాలలో చూసేవాళ్ళము. కానీ ఇప్పుడు మాత్రం ట్రెండ్ మారింది. మొగుడికి ఉన్న విలువ తగ్గింది. అందుకే సినిమా లు మించిన విదంగా బయట భార్యలు భర్తల ను అమ్మేస్తున్నారట. అవునండి ఇది నిజమే.. 

 


తన భర్త మరో మహిళ తో సంబంధం పెట్టుకున్నాడని భర్తనే అమ్మేసింది మరో మహిళ.. ఒక రోజు తన ముందే.. తన భర్త మరో మహిళతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. దీంతో.. ఆమె ఎంతగానో కుంగిపోయింది. కానీ ఇప్పుడు కాలం మారింది. చిన్న గొడవ వస్తే చాలు... భర్తను వదిలేస్తున్నారు. ఎక్కువ మాట్లాడితే విడాకులు ఇస్తున్నారు. 

 

అది సరిపోదు నాకేమి తక్కువ నేను మరో పెళ్లి చేసుకుంటాన ని అతని కన్నా ముందే మరొక పెళ్లి చేసుకొని దర్జాగా తిరుగుతున్నారు. అసలు విషయాని కొస్తే.. ఓ మహిళ మాత్రం ఈ రెండు కోవలకు చెందదు. భర్తను మరో మహిళకు డబ్బులకి అమ్మేసి.. వాటి తో చక్కగా కొత్త డ్రెస్లు కొనుకుందట. కెన్యా రాజధాని నైరోబీ లోని ఓ ప్రాంతానికి చెందిన ఎడ్నా ముక్వానా అనే మహిళకు కొన్ని సంవత్సరాల క్రితం వివాహమైంది. పిల్లలు కూడా ఉన్నారట. 

 

అయితే అనుకోకుండా భార్య ముందు అడ్డంగా దొరికిపోయిన భర్తను ఆమెకే డబ్బులకు అమ్మేసిందట. వచ్చిన డబ్బులతో కొత్త బట్టలు కొనుక్కొని సంబరాలు చేసుకుందట. పిల్లల పోషణ తానె చూసుకుంటానని గర్వాంగా చెప్పుకుంటుంది. అవ్వా ఆమె చేసిన పనికి కొంత మంది శబాష్ అంటే మరికొందరు వాయించి కొట్టకుండా వదిలేసిందా అని దుమ్మెత్తిపోశారు. మొత్తానికి మహిళలు ఇలాంటి విషయాల్లో కూడా ముందే ఉన్నారు అని నిరూపించింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: