అమ్మ ప్రేమ వివరించడానికి మన ఈ జన్మ సరిపోదు. ఎందుకంటే ప్రేమంటే ఏంటో మొదట మనకు తెలిసేది తల్లి దగర నుండే ఆ తల్లి ప్రేమను వర్ణించడానికి భాష సరిపోదు. అమ్మ అనే పదానికి అంతటి మహత్మ్యం ఉంది. మనకు జన్మనిచ్చి, ఇంతటి వారిని చేసిన దేవుళ్లను కళ్ల ముందు ఉంచుకుని, కనిపించని ఆ దేవుడు కోసం గుళ్లు, గోపురాల చుట్టూ తిరుగుతాం.

 

తెల్లవారు ఝాము నుంచి రాత్రి పడుకునే వరకు కంప్యూటర్‌లా అమ్మ ఇంటి పని చేస్తూనే ఉంటుంది. ఎప్పుడైనా కుటుంబ సభ్యులు సహాయపడతామన్నా కూడా తిరస్కరించి నేను చేస్తున్నా కదా అంటూ తన పనిలో నిమగ్నం అవుతుంది మాతృమూర్తి. భర్తకు టిఫిన్ బాక్స్ తో సహా అన్నీ అందించి ఆఫీసుకి సాగనంపుతుంది. పిల్లల్ని బడికి పంపించడం కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం పాఠశాల వెళ్ళేందుకు బస్ ఎక్కించడం వరకూ అన్నీ చేస్తుంది. వారు వెళ్లిపోయాక విశ్రాంతి ఉంటుందా? అంటే మిగిలిన పని అంతా చేయాలి. ఆ విధంగా మాతృమూర్తికి నిమిషం రెస్టు ఉండదు. ఇలా హౌజ్ వైఫ్ట్స్ చేస్తుంటే. కొంత‌మంది ఆడ‌వారు అటు ఇంట్లో ప‌ని ఇటు బ‌య‌ట ఉద్యోగాలు చేస్తూ ఇంట్లో ఆర్ధికంగా కూడా కొంత మంది ఆడ‌వాళ్ళు ఆదుకుంటూ ఉంటారు. ఇలా రెండు విధాలా త‌ల్లి అనేది త‌న కుటుంబాన్ని కాపాడుకుంటూ ఉంటుంది.  గడియ కూడా కూర్చోదు. ఆరోగ్యంగా లేకున్నా సరే ఇంటి పని చేస్తూనే ఉంటుంది. ఎంత ఆధునిక కాలంలో ఉన్నా కూడా తల్లిపాత్ర తీరనిదే!. అయితే, మనకు జీవితాన్ని ఇచ్చిన కన్న తల్లిదండ్రుల పట్ల కొంమంది నిర్దయగా ప్రవర్తించడం అమానవీయం మాత్రమే కాదు, మనకు మనం విలువనిచ్చుకోలేని నైజం.

 

అమ్మను ప్రేమగా చూసుకోలేని వారు ఉన్నా లేనట్లే. వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేయడం అన్నిటికీ మించిన ఘోరం. చాలా మంది పిల్ల‌లు అయిన త‌ర్వాత వాళ్ళ‌కుండే బాధ్య‌త‌ల వ‌ల్ల త‌ల్లిదండ్రుల‌ను వ‌దిలి అమ్మ పెంచి పెద్ద చేస్తేనే ఈస్థాయిలో ఉన్నామనే ధ్యాస లేకపోవడం, మాతృమూర్తి పట్ల విచక్షణ కోల్పోవడం అంటే ప్రాణం కోల్పోయినట్లే! అమ్మ గురించి చాలా సందేశాత్మక సినిమాలు వచ్చాయి. ఎన్నో పాటలు, పద్యాలు, కవితలు, కథలు, నవలలు వచ్చాయి. అమ్మ గురించి వచ్చినవన్నీ ఘనమైన విజయం సాధించాయంటే అమ్మతనమే కారణం. ఇవ‌న్నీ చెప్పుకోడానికి విన‌డానికి మాత్ర‌మే కాదు త‌ల్లిదండ్రుల‌ను గౌర‌విస్తూ మంచిగా చూసుకోవాలి. అమ్మ‌కి క‌నీసం ఆదివారం కూడా సెల‌వు లేకుండా మ‌న‌కోసం నిరంత‌రం క‌ష్ట‌ప‌డుతూనే ఉంటుంది. ఒక్క‌రోజైనా క‌నీసం విశ్రాంతి ఉండ‌దు. 

మరింత సమాచారం తెలుసుకోండి: