పెళ్లంటే నూరేళ్ళ బంధం అని చాలా మంది అంటారు. మూడు ముళ్ల  బంధంతో ఏకమవుతారు. అందుకే  పెద్దలు అంటారు జీవితం అనేది పాతికేళ్ళు పెద్దలతో ఉంటె. డెబ్భై ఐదేళ్లు బ్రతికాలంటే మరొక తోడు కావాలంటూ అంటున్నారు. అయితే పెళ్లి చేసుకోవాలనుకుంటే అటు ఏడూ తరాలు ఇటు ఏడూ తారలు చూడాలని అంటారు. అప్పుడు వాళ్ళ ఫ్యామిలి గురించి తెలుస్తుంది జీవితాం సాఫీగా సాగుతుందని అంటారు. 

 

ఇది ఇలా ఉండాగా పెళ్లి చేసుకొని నీకు అండగా ఉంటాను నూరేళ్లు నే పోషణ చూస్తాను అంటూ మాయమాటలు చెప్పి పండగ రాగానే పక్కకు తప్పుకున్నాడు. పండగగకు పుట్టింటికి భార్యను పంపి ఇల్లు ఖాళీ చేసి పరారయ్యాడు. వివరాల్లోకి వెళితే.. కూకట్‌పల్లి ఠాణా పోలీసులు, బాధితుల కథనం ప్రకారం..కూకట్‌పల్లి షంషీగూడలో సతీష్‌(35), సంధ్యారాణి కుటుంబం అద్దెంట్లో నివాసముంటోంది. వీరికి కుమార్తె, కుమారుడు సంతానం. దుస్తుల షోరూంలో సతీష్‌ పనిచేస్తుండగా.. సంధ్యారాణి గృహిణి. 

 


సంక్రాంతి సందర్భంగా ఈ నెల 11న భార్య, పిల్లలను మిర్యాలగూడలోని అత్తారింటికి పంపించాడు. తనకు వ్యాపార పనులున్నాయని చెప్పి వెళ్లలేదు. తరువాత 13వ తేదీ నుంచి అతడి సెల్‌ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేసి ఉంది. అనుమానంతో మంగళవారం ఇంటికి వచ్చిన భార్య హతుశురాలైంది. తాము ఉంటున్న ఇంటిని భర్త ఖాళీ చేసి అప్పటికే వెళ్లిపోయాడు. దీంతో బాధితురాలు కూకట్‌పల్లి పోలీసులను ఆశ్రయించారు.

 


కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసులు షాక్ అయ్యే ఒక విషయం వెలుగు చూసింది. తన మిత్రుడు అభిలాష్‌తో కలిసి కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌లోని న్యాయస్థానానికి వచ్చాడు. సాయంత్రం తన మిత్రుడికి చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఫోన్‌ స్విచ్ఛాప్‌ అయింది. అలా వెళ్లిన ఇద్దరు జాడ ఇప్పటి వరకు కనపడ లేదనే చెప్పాలి. పోలీసులు గాలింపులు ముమ్మరం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: