చికెన్ కర్రీ.. ఎలా చేసిన తింటారు ఆహార ప్రియులు.. అయితే అలాంటి చికెన్ ముక్కలను.. మనం ఆలా ఇలా అని ఎన్నో రకాలుగా చేసుకొని.. తింటాము.. అయితే ఈ చికెన్ కర్రీలో మరో వింతైన వంటకం అనార్కలి చికెన్. వినడానికి వింతగా ఉన్న తినడానికి రుచిగా ఉంటుంది. 

 

అయితే ఈ అనార్కలి చికెన్ ను ఎలా చేయాలో తెలుసా ? అసలు దీని రుచి ఎంతో అద్భుతంగా ఉంటుంది. అయితే అలాంటి అద్భుతమైన అనార్కలి చికెన్ కర్రీని ఎలా చేయాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. ఇంట్లో ప్రయత్నించండి.. ఇంట్లోవారికి వడ్డించి పెట్టండి.. రుచికి పెట్టింది పేరుగా ఈ అనార్కలిచికెన్ ఉంటుంది. 

 

కావాల్సిన పదార్ధాలు.. 

 

చికెన్‌ లెగ్స్‌ 8, 

 

పెరుగు 200 గ్రా, 

 

గరం మసాలా 10 గ్రా, 

 

కర్బూజా గింజలు 100 గ్రా, 

 

జీడిపప్పు పలుకులు 100గ్రా, 

 

బాదం 30గ్రా, 

 

గసగసాలు 30గ్రా, 

 

చిలోంజి పప్పు 30గ్రా, 

 

మీగడ 50గ్రా, 

 

దానిమ్మ రసం 200గ్రా, 

 

దానిమ్మ పండు 1, 

 

పచ్చ యాలుకల పొడి 1టీ స్పూన్‌, 

 

తెల్ల మిరియాల పొడి 1టీ స్పూన్‌, 

 

పచ్చి మిరపకాయల ముద్ద 1 స్పూన్‌, 

నూనె 50 మిలీ.

 

తయారీ విధానం.. 

చికెన్‌కి ఉప్పు, కొద్దిగా నూనె పట్టించి పక్కన పెట్టండి. జీడిపప్పు, గసగసాలు, బాదం, కర్బూజా గింజలను ఉడికించి నీటిని వంచేసి మెత్తగా రుబ్బండి. మందపాటి మూకుడులో నూనెను వేడి చేసి దానిలో గరం మసాలా వేయండి. పప్పుల ముద్దను చిలకరించిన పెరుగులో కలిపి మూకుడులో వేయండి. సన్నటి సెగ మీద నూనె పైకి తేలే వరకు ఉడికించండి. ఉప్పు, తెల్లమిరియాల పొడి, పచ్చి మిరపకాయల ముద్దను ఈ మిశ్రమంలో వేసి కలియబెట్టండి. యాలకల పొడి, దానిమ్మరసం కూడా కలిపి, ఆ తర్వాత చికెన్‌ లెగ్స్‌ను వేయండి. సన్నటి సెగ మీద చికెన్‌ ఉడికే వరకు మగ్గనివ్వండి. చివరలో మీగడ కలిపి కింద కి దించండి. మీగడ, దానిమ్మ గింజలు వేసి వేడిగా దించండి. అంతే అద్భుతమైన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ అనార్కలి చికెన్ కర్రీని చేసుకొని తినండి.  

మరింత సమాచారం తెలుసుకోండి: