అమ్మ అన్న పదంలో ఉన్న తియ్య‌ద‌నం గురించి తెలియ‌ని వారు ఎవ్వ‌రూ ఉండరు. తెల్ల‌వారు లేచిన ద‌గ్గ‌ర నుంచి అమ్మ త‌మ పిల్ల‌లు, భ‌ర్త  కుటుంబం కోసం ఎంత క‌ష్ట‌ప‌డుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఉద‌యం లేచిన ద‌గ్గ‌ర నుంచి పిల్ల‌కు సేవ చేస్తూనే ఉంటుంది. వాళ్ళు తినే తిండి క‌ట్టుకునే బ‌ట్ట ప్ర‌తిదీ గ‌మ‌నించుకుంటూ ఎల్ల‌ప్పుడూ కాపాడుకునేదే అమ్మ‌. మ‌రి కొంత మంది అమ్మ‌లైతే ఇంట్లో ఆర్ధికంగా ఇబ్బంది ఉంటేవారు కూడా ఉపాది కోసం క‌ష్ట‌ప‌డుతూ ఉంటారు. ఇటు ఇంట్లో అటు బ‌య‌ట ఇలా చాలా ఇబ్బందులు ప‌డుతూ త‌ల్లి త‌మ బిడ్డ‌ల‌ను పెంచుకుంటూ ఉంటుంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆ త‌ల్లి ఆరోగ్యం ఎప్పుడైనా కాస్త బావుండ‌క పోతే ఇక ఆ ఇల్లు గుల్లే. ఆమెను ప‌ట్టించుకునేవారు ఎవ్వ‌రూ ఉండ‌రు.

 

అదే గ‌నుక బిడ్డ‌ల‌కు బాలేక‌పోతే ఆ త‌ల్లి త‌ల్ల‌డిల్లిపోతుంది. ఏ కాస్త జ్వ‌ర‌మొచ్చిన తిండి, నిద్రాహారాలు మాని మ‌రి సేవ‌లు చేస్తూ ఉంటుంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో త‌ల్లికి మాత్రం కొంచం బావుండ‌క పోయినా ఈ రోజుల్లో పిల్ల‌లు పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇక‌పెద్ద‌వ‌య‌సు వ‌స్తే మాత్రం వాళ్ళ బాగోగులు చూడ‌టానికి అస‌లే ఉండ‌రు. పిల్ల‌లు పెద్ద‌య్యేవ‌ర‌కు త‌ల్లి ఎంత ప్రేమ‌గా ఆల‌న‌గా లాల‌న‌గా చూస్తుందో త‌ల్లిని మాత్రం అలా చూడ‌రు. కొంత మందికైతే క‌నీసం ఫోన్‌చేసి మంచి చెడులు మాట్లాడే టైం కూడా ఉండ‌డం లేదు. త‌ల్లికిచ్చే గౌర‌వ‌మేమిట‌నేది ఇక్క‌డే అర్ధ‌మ‌వుతుంది. మ‌రి కొంత మంది త‌ల్లిదండ్రుల‌ను ప‌ట్టించుకునే టైం లేక వృద్ధాశ్ర‌మాల్లో పెడుతున్నారు. అక్క‌డ వారు ఎవ‌రూ లేని అనాధ‌ల్లా ప‌డి ఉండాల్సి వ‌స్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: