కావాల్సిన ప‌దార్థాలు:
రాగిపిండి- ఒక‌ కప్పు
నెయ్యి- అర‌ కప్పు
పల్లీలు- ఒక‌ కప్పు

 

బెల్లం తురుము- ఒక‌ కప్పు
జీడిపప్పు- కొద్దిగా
ఎండు ద్రాక్ష- కొద్దిగా

 

యాలకుల పొడి- అర టీ స్పూన్‌
నువ్వులు- ఒక‌ కప్పు
బాదం పప్పు- గుప్పెడు

 

తయారీ విధానం:
ముందుగా స్టౌ మీద పాన్ పెట్టుకుని వేడి అయ్యాక పల్లీలు,  బాదం పప్పు, జీడిపప్పు, నువ్వులు, రాగి పిండి ఇలా విడివిడిగా వేయించి పక్కన ఒక్కో గిన్నెలో పెట్టుకోవాలి. అవి ఆరిన తర్వాత పల్లీలు, నువ్వులు, బాదం పప్పు, జీడిపప్పు కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమానికి వేయించి పెట్టుకున్న రాగిపిండి, బెల్లం తురుము, యాలకుల పొడి వేసి కలపాలి.

 

ఇందులోనే మరికొన్ని జీడిపప్పు పలుకులు, ఎండుద్రాక్ష కూడా వేసి కొద్దికొద్దిగా కాచిన తాజా నెయ్యి కలుపుకొని లడ్డుగా చుట్టుకోవాలి. రాగి పిండి మరీ పొడిగా ఉంటే కొద్దిగా పాలు కలిపి లడ్డులా చేసుకోవచ్చు. అంటే ఆరోగ్య‌క‌ర‌మైన‌.. రుచిక‌ర‌మైన రాగిలడ్డు రెడీ. ఆరోగ్యానికి రాగులు ఎంతో మంచిది. సో.. రాగిపిండితో ఇలా చేసుకుంటే.. ఎవ‌రైనా ఇష్టంగా తింటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: