వంకాయ పచ్చడి ఎప్పుడైనా తిన్నారా? ఈ వంకాయ పచ్చడి తినటం వల్ల కొంతమంది నవ్వలు వస్తాయి.. కానీ అందరికి ఆలా ఉంటుంది అని ఎం ఉండదు.. అయితే ఇప్పుడు ఈ వంకాయ పచ్చడి ఎలా చెయ్యాలో ఇక్కడ చదివి తెలుసుకోండి. ఇంట్లోనే రుచికరమైన వంకాయ పచ్చడి చేసుకొని తినండి. 

 

కావలసిన పదార్థాలు... 

 

లేత వంకాయలు - అరకేజీ, 

 

నల్ల నువ్వులు - పావు కప్పు, 

 

కొత్తిమీర తరుగు - పావు కప్పు, 

 

పచ్చిమిర్చి - 8, 

 

చింతపండు గుజ్జు - 3 టేబుల్‌ స్పూన్లు, 

 

బెల్లం తురుము - 1 టేబుల్‌ స్పూను, 

 

వేగించిన మెంతిపొడి - పావు టీ స్పూను, 

 

ఇంగువ - చిటికెడు, 

 

పసుపు - అర టీ స్పూను, 

 

నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, 

 

ఉప్పు - రుచికి తగినంత, 

 

నూనె, ఆవాలు, మినప్పప్పు, 

 

కరివేపాకు, ఇంగువ - సరిపడా.

 

తయారీ విధానం...  

 

నువ్వులను దోరగా వేగించి పక్కనుంచాలి. ఒక టీ స్పూను నూనెలో పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు, ఇంగువ, మెంతిపొడి వేసి రెండు నిమిషాలు వేగించి తీసెయ్యాలి. అదే కడాయిలో మిగతా నూనె వేసి వంకాయముక్కలతో పాటు అరకప్పు నీరు పోసి మూతపెట్టి మెత్తగా ఉడికించి చల్లారిన తర్వాత చేత్తో మెదిపి పక్కనుంచాలి. మిక్సీలో ముందుగా నువ్వులు పొడి చేసుకుని, అందులోనే పచ్చిమిర్చి, కొత్తిమీర, బెల్లం, చింతపండు గుజ్జు, ఉప్పు వేసి పేస్టు చేసుకుని, మెదిపిన వంకాయల్లో కలపాలి. తర్వాత విడిగా పెట్టుకున్న తాలింపును ఈ మిశ్రమంలో కలపాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: