సెక్స్ అనేది శరీరానికి సంబంధించింది... సెక్స్ వర్కర్స్ చాలా మంది కండోమ్ లేకుండా సెక్స్ చేయరు...ఎందుకంటే చాలా మంది తో  సెక్స్ చేస్తూ ఉంటారు..అలాంటి వారు డబ్బుల కన్నా కూడా ఆరోగ్యాన్ని చూసుకుంటారు. అలాంటి ఓ మహిళ కండోమ్ లేకుండా సెక్స్ చేయొద్దని అన్నందుకు ఓ మగాడు దారుణంగా హత్య చేశాడ ట... ప్రస్తుతం ఈ విషయం చర్చ నియంసంగా మారింది.

 

వివరాల్లోకి వెళితే..42 ఏళ్ల మహిళ భర్తను వదిలేసి, కొడుకుతోపాటు వెస్ట్ బెంగళూరులోని గాయత్రి నగర్ లో నివసిస్తోంది. పొట్టకూటికోసం సెక్స్ వర్కర్ గా పనిచేస్తోన్న ఆమెకు ఈ నెల11న ముకుందా(48) అనే వ్యక్తి ఎదురయ్యాడు. మాండ్యాకు చెందిన ఆయన చాలా ఏళ్లుగా బెంగళూరులోనే సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. బేరం కుదిరిన తర్వాత ఇద్దరూ కలిసి ఆమె ఇంటికెళ్లారు. అసురక్షిత లైంగిక సంబంధాలపై అవగాహన కలిగిన ఆమె.. కండోమ్ ధరించాల్సిందిగా అతణ్ని కోరింది.

 

అందుకు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. కండోమ్ లేకుండానే బలవంతపెట్టబోయాడు. ఎంతకీ వీలుపడకపోవడంతో తన డబ్బులు తిరిగిచ్చేయాలని డిమాండ్ చేశాడు. డబ్బులు తిరిగివ్వడం కుదరదన్న ఆమె.. ఎక్కువ మాట్లాడితే చుట్టుపక్కలవాళ్లకు వినిపించేలా గోలచేస్తానని బెదిరించడంతో ముకుంద్ ఉన్మాదిలా మారిపోయాడు. తన బ్యాగులో కత్తి తీసి ఆమె పొట్టలో పొడిచేశాడు. 

 

ఆమె బాధతో కేకలు వేయబోతుండగా గొంతు కూడా కోసేసి, ఆమె ఒంటిమీదున్న గిల్టు నగలు, సెల్ ఫోన్లు తీసుకుని పరారయ్యాడు. ఇంటికొచ్చిన కొడుకు ఆమెను చూసి నిర్ఘాంత పోయాడు.. అందరినీ పిలిచాడు.. పోలీసులకు కంపైంట్ ఇవ్వగా అసలు నిజాలు బయటకొచ్చే..వారం రోజుల పాటు హత్య జరిగిన ఏరియాలోని అన్ని సీసీటీవీ కెమెరాల రికార్డుల్ని పరిశీలించగా.. చివరికి ఓకే ఒక్క కెమరాలో నిందితుడు హతురాలితో కలిసున్న విజువల్ దొరికింది. దాని ఆధారంగా గాలించిన పోలీసులు బుధవారం ఎట్టకేలకు నిందితుణ్ని పట్టుకున్నారు. హత్య చేసింది తానేనని అంగీకరించడంతో ముకుంద్ ను రిమాండ్ కు తరలించారు... ఎటు చూసినా మహిళలకు రక్షణ లేకపోవడంతో మహిళలు డిమాండ్ చేస్తున్నారు...

 

మరింత సమాచారం తెలుసుకోండి: