కావాల్సిన ప‌దార్థాలు:
మటన్ ఖీమా- పావు కేజి
ఉల్లిపాయలు- రెండు
టమోటాలు- రెండు

 

కారం- ఒక టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్‌- ఒక‌టిన్న‌ర స్పూన్‌
నూనె- త‌గినంత‌
ఉప్పు- రుచికి సరిపడా


 
గరం మసాలా- అర టీ స్పూన్‌
కరివేపాకు- మూడు రెబ్బ‌లు
కొత్తిమిర- కొద్దిగా
పసుపు- చిటికెడు

 

తయారీ విధానం:
ముందుగా నీటిలో ఖీమాను బాగా శుభ్రం చేసుకుని పక్క‌న‌ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ పాన్ పెట్టుకుని నూనె వేసి తరిగిన పెట్టుకున్న‌ ఉల్లిపాయలు వేసి దోరగా వేగిన తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, పసుపు, కారం వేసి కలిపి ఒక ఐదు నిమిషాల పాటు వేయించాలి. తర్వాత అందులో  ఖీమా, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. 

 

సన్నని సెగ మీద పెట్టి అందులోని నీరు పూర్తిగా ఇగిరిపోయేవ‌ర‌కు ఉడికించాలి. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన టమాటా, గరం మసాలా పొడి  వేసి కలిపి కప్పు నీరు పోసి మెత్తగా ఉడికేవరకు ఉంచాలి. నీరంతా ఇరిగిపోయాక కొత్తిమీర చల్లి స్టౌ ఆఫ్ చేస్తే వేడి వేడి మటన్ ఖీమా రెడీ. దీన్ని రైస్ లేదా రోటితో తింటే అదిరిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: