కావాల్సిన ప‌దార్థాలు:
మైదా- పావుకిలో
వాల్‌నట్ పలుకులు - 25గ్రా
పంచ‌దార‌ పొడి- 200 గ్రా

 

బేకింగ్ సోడా - 2 గ్రా 
గుడ్లు- 6
బటర్- పావుకిలో
జీడిప‌ప్పు ప‌లుకులు- 100 గ్రా

 

త‌యారి విధానం: ముందుగా ఒక గిన్నెలోకి పందార‌ పొడి, గుడ్ల సొన వేసి బాగా బీట్ చేసి తరవాత అందులో మైదాపిండి, బటర్, వాల్‌నట్ పలుకులు, జీడిప‌ప్పు ప‌లుకులు, బేకింగ్‌సోడా వేసి పావు గంట‌ పాటు బాగా కలిపి పెట్టుకోవాలి. 

 

ఇప్పుడు బటర్ రాసిన మౌల్డ్ లోపల ఈ మిశ్రమాన్ని పోసి సమానంగా పరచి ఓవెన్‌లో 180- 200 డిగ్రీల వద్ద 40 నిముషాల పాటు బేక్ చేసి బయటకు తీసి నచ్చిన క్రీమ్‌తో డెక‌రేట్ చేసుకుంటే స‌రిపోతుంది. అంతే ఎంతో సులువైన.. ఆరోగ్య‌క‌ర‌మైన వాల్‌నట్ కేక్ రెడీ.

 

వాల్‌నట్స్‌ ఆరోగ్యానికి చాలా మంచిద‌ని తెలిసిన విష‌య‌మే. వాల్‌న‌ట్స్‌ను తినటం వల్ల హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వాల్నట్లో విటమిన్లు, అవసరమైన ఖనిజాలు, కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: