మునక్కాయలే కాదు మునగ ఆకుల్లోనూ ఎన్నో పోషకాలు ఉంటాయి. ఆయుర్వేద వైద్య విధానాల్లో మునగకుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. మునగ ఆకుల్లో ఏ, బీ, సీ విటమిన్లు, కాల్షియం, ఐరన్, అమైనో ఆమ్లాలు అన్ని ఉంటాయి. అయితే ఈ మునగాకుతో మన భారత్ లో పప్పు, ఫ్రై అన్ని చేసుకొని తింటారు.. అయితే ఇప్పుడు ఇప్పుడు మునగాకుతో పప్పు ఎలా చేస్తారు అనేది తెలుసుకోండి.. పప్పుని తినండి శక్తి తెచ్చుకోండి. 

 

కావలసిన పదార్థాలు... 

 

పెసరపప్పు - ఒక కప్పు, 

 

మునగ ఆకు సన్నగా తరిగినది - ఒక కప్పు, 

 

పచ్చిమిరపకాయలు - 3 లేక 4, 

 

పసుపు - చిటికెడు, 

 

ఉప్పు - తగినంత, 

 

నిమ్మచెక్క - ఒకటి, 

 

నూనె - తగినంత, 

 

పోపు గింజలు - టీ స్పూను.

 

తయారీ విధానం... 

 

ముందుగా ఒక గిన్నెలో పెసర పప్పును ఉడికించుకోవాలి. అది ఉడికే సమయంలో అందులో వరసగా మునగ ఆకు, పసుపు, పచ్చి మిరపకాయలు, ఉప్పు వేసి పప్పు పూర్తిగా ఉడికిన తర్వాత నిమ్మకాయ పిండాలి. ఆ తర్వాత స్టవ్‌పై కడాయి ఉంచి అందులో కాస్త, పోపు గింజలు వేసి వేగించి పప్పులో కలపాలి. కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకోవాలి. అంతే మునగాకు పప్పు రెడీ అయిపోతుంది. ఈ పప్పు చెపాతీలలోకి.. అన్నంలోకి ఎంతో రుచిగా ఉంటుంది. 

  

మరింత సమాచారం తెలుసుకోండి: