కావాల్సిన ప‌దార్థాలు:
పొట్లకాయ- ఒక‌టి
గట్టి పెరుగు- పావుకిలో
పచ్చి మిర్చి- మూడు
అల్లం- చిన్న ముక్క‌

 

కరివేపాకు- రెండు రెమ్మలు 
నూనె- రెండు చెంచాలు
ఉప్పు- రుచికి సరిపడా 
ఎండు మిర్చి- ఒక‌టి

 

మినప పప్పు- అరచెంచా
జీలకర్ర, ఆవాలు- పావు చెంచా
ఇంగువ- చిటికెడు

 

త‌యారి విధానం: ముందుగా పొట్లకాయను కడిగి ముక్కలుగా తరగాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్క‌ర్‌ లో తగినంత నీరు పోసి అందులో ఈ ముక్కలు, తగినంత ఉప్పువేసి రెండు విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించి స్టవ్ ఆపేసుకోవాలి. ప్రెషర్ విడుదల అయ్యేలోపున అల్లం, పచ్చిమిర్చి మిక్సీ పట్టి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి పెరుగు తీసుకొని మీగడ తరకలు లేకుండా గరిటతో కలిపి అల్లం, పచ్చి మిర్చి ముద్ద కలుపుకోవాలి.

 

ఆవిరి పోయిన తర్వాత పాన్ మూత తీసి ముక్కలు తీసి కాస్త చ‌ల్లారాక నేరుగా పెరుగులో కలపాలి. చివరగా దీనికి పోపు పెట్టుకొంటే పచ్చడి రెడీ అయినట్టే. అంతే నోరూరించే పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ..!

మరింత సమాచారం తెలుసుకోండి: