ప్రేమకు వయసుతో పని లేదంటున్నాడు ఓ ప్రబుద్దుడు.. ఈ కాలంలో అన్నీ మారుతున్నాయి. ఏది ఒక పట్టాన జరగడం లేదంటే నమ్మండి. సినిమాలు తలపించేలా ప్రేమలు, అది కాదంటే కాటికి పంపడాలు ఇవన్నీ కూడా ఈ సినిమాలలో జరుగుతున్నాయి. ఇకపోతే యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ప్రేమ పుడితే అది ఒక లెక్క కానీ, కాటికి పోవాల్సిన వయసులో కాపురం అంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. 

 

ఓ ప్రాంతంలో అలానే జరిగిందట.. లేటు వయసులో పెళ్ళికి ఓ వ్యక్తి సై అన్నాడు.  మొదట్లో మాయ మాటలు చెప్పి వారిని నమ్మించి తమ ట్రాప్ లో పడ్డ తరువాత వారికీ చుక్కలు చూపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచుగా బయట పడుతున్నాయి. అయినప్పటికీ కూడా అమ్మాయిలు ఇంకా ఇలాంటి ట్రాప్స్ లో పడి లైంగికంగా అనేక ఇబ్బందులని ఎదుర్కుంటున్నారు. ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలే లక్ష్యంగా కొందరు తమ ప్లాన్ అమలు చేస్తూ వారిని లైంగికంగా వేధిస్తున్నారు. అలాంటి ఘటనే తాజాగా ఒకటి యూకే లో బయటపడింది.

 

అసలు విషయానికొస్తే.. ఓ వ్యక్తి  21 మందికి పైగా అమ్మాయిలకు అసభ్యకరంగా మెసేజ్ లు పంపిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడట.. అసలెందుకు చేస్తున్నాడు అనే విషయానికొస్తే..  భారత సంతతికి చెందిన వాల్మీకి రాంప్రసాద్ కి లండన్ కోర్టు గురువారం ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. బాలికలను ఆన్ లైన్ లో లైంగికంగా ప్రేరేపించడం అసభ్య చిత్రాలను తయారు చేయడం వంటి 26 నేరాలు రుజువవడంతో న్యాయస్థానం ఈ శిక్ష విధించింది. న్యాయస్థానం లో తెలిపిన వివరాల ప్రకారం... 2017 అక్టోబర్ నుంచి 2018 సెప్టెంబర్ వరకు రాంప్రసాద్ సుమారు 21 మంది మైనర్లను ఇలా ఆన్ లైన్ వేదిక గా లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తెలుస్తుంది. బాధిత బాలికలందరీ వయసు 13 నుంచి 15 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిసింది

 


ఓ యాప్ ద్వారా అమ్మాయిలను పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి వయసు 47.. అయితే అమ్మాయిలకు లైంగికంగా మెసేజ్ లు పంపుతూ ఇబ్బందికి గురిచేస్తున్నాడు. మరో విశేషమేంటంటే.. అమ్మాయిల ఫోటోలను తీసుకొని వాటిని అసభ్యకరంగా మార్పింగ్ చేసి మరి క్రూరంగా ప్రవర్తిస్తున్నాడట. భాదిత అమ్మాయిల ఫిర్యాదు మేరకు రంగం లోకి దిగిన పోలీసులు ..అతన్ని పట్టుకొని కోర్ట్ లో హాజరు చేయగా.. కోర్టులో విచారణకు వచ్చింది. విచారణలో తన నేరాన్ని అంగీకరించిన రాం ప్రసాద్ కు న్యాయస్థానం గురువారం శిక్షను ఖరారు చేసిందీ. అంతేకాకుండా ఆరేళ్ళ జైలు శిక్షలు విధించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: