ఆరు గజాల చీర.. మోము మీద బొట్టు ఉంటె వారిని భారతీయ స్త్రీ అంటారు. అది ఒకప్పుడు అని చాల మంది అంటున్నారు. అయితే ఇప్పుడు ప్రపంచమే డబ్బు మీద నడుస్తోందన్న విషయం తెలిసిందే.  అయితే చాలా మంది ఇప్పడు డబ్బుల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. చిన్న పిల్లలు లేదా యువత చేస్తున్నారంటే ఒక లెక్క అనుకోవచ్చు కానీ,పెద్ద వయసుతో ఉన్నవారు కూడా చేస్తున్నారట. 

 


వివరాల్లోకి వెళితే..ప్రముఖులతో పరిచయం ఏర్పరచుకుని, వారితో సన్నిహితంగా మెలిగి తర్వాత పెద్దమొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్న కిలేడీని మహారాష్ట్రలోని పుణె పోలీసులు అరెస్ట్ చేశారు. పుణెలోని ఓ కార్పోరేట్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తికి ఇటీవల ఓ మహిళ పరిచయమైంది. కొద్దిరోజులకే వారిద్దరూ సన్నిహితులయ్యారు. మేనేజర్‌ పూర్తిగా తన మాయలో పడ్డాడని నిర్ధారణ చేసుకున్న ఆ మహిళ తనకు రూ.7లక్షలు కావాలని అడిగింది.

 


బాగా పరిచయం పెరగడంతో ఆధారాలను కూడా బాగా సంపాదించింది కీలెడి.. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే రేప్ కేసు పెట్టి జైలుకు పంపిస్తానని బెదిరించింది. దీంతో ఆందోళనకు గురైన అతడు రూ.45వేలు ఇచ్చాడు. ఆ డబ్బు చాలదని, మొత్తం రూ.7లక్షలు ఇవ్వాల్సిందేనని ఆమె వేధింపులకు గురిచేసింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ రాజేంద్ర మొహిలే తన బృందంతో కలిసి శనివారం నిందితురాలిని అరెస్టు చేశారు. 

 


ఈ మహిళా చాలా కంపెనీల హెచ్ ఆర్ లతో పరిచయాలను పెంచుకొని గురి చూసి దెబ్బ కొట్టేది. తర్వాత అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే రేప్ కేసు పెడతానంటూ బెదిరిస్తుందని పోలీసుల విచారణలో తేలింది. నిందితురాలిని కోర్టులో హాజరుపరచగా.. జనవరి 29 వరకు రిమాండ్ విధించారు. దీంతో ఆమెను జైలుకు తరలించారు. మరి ఎంత మంది దగ్గర ఎంత వసూల్ చేసింది అనే వివరాలు తెలియాల్సి ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: