చదువులు, ఉద్యోగాలు అంటూ పిల్ల‌లు ఊళ్ళ‌ను విడిచి ప‌ట్ట‌ణాల‌కు వెళ్ళ‌డం ఈ రోజుల్లో స‌ర్వ‌సాధార‌ణంగా మారిపోయింది.  సొంత ఊళ్ళో చేసుకోవటానికి పనులు లేక, కుటుంబం గడవ భర్త, తన పిల్ల‌ల‌తో పట్నానికి చేరుకుంటున్నారు. అక్కడే భార్యాభర్తలు చెరొక పని చూసుకుంటూ బ్ర‌తుకుతున్నారు. వచ్చే రోజువారి కూలితో జీవనం సాగిస్తున్నారు. ఇద్ద‌రూ సంపాదిస్తేనేగాని క‌డుపునిండ‌ని కొన్ని బ్ర‌తుకులు ఉంటాయి. దీంతో బిడ్డ‌ల‌ను త‌మ చెంత‌నే ఉంచుకుని ప‌ని చేసుకునేవారు చాలా మంది ఉంటారు.  ఆకలేసినపుడు అమ్మదగ్గరకు వచ్చి పాలు త్రాగుతూ అక్క‌డే ఆడుకోవ‌డం లాంటివి చేస్తుండేవారు. నిద్ర వచ్చినపుడు అక్కడే నిద్ర పోవ‌డం. పని అయిపోయిన తరువాత తిరిగి త‌ల్లితో క‌లిసి ఇంటికి తీసుకువెళ్ళ‌డం.

 

               ఇలా కొంత మంది ఉంటే...మ‌రికొంద‌రు చ‌దువులు, ఉద్యోగాలు అంటూ అక్క‌డే ఉంటూ ఎప్పుడో ఒకసారి త‌ల్లిదండ్రుల‌ను ప‌ల‌క‌రించ‌డానికి వ‌స్తూ ఉంటారు. ఇలాంటి స‌మ‌యాల్లో ఎక్క‌డో ఎవ‌రూ లేని చోట పిల్ల‌లు ఒక‌చోట త‌ల్ల‌లు ఒక‌చోట పొట్ట‌తిప్ప‌ల కోసం బాద‌లు ప‌డ‌టం రోజు మ‌నం అనేకం చూస్తూనే ఉంటాం.  ఇక ఇదిలా ఉంటే కొన్ని సార్లు బిడ్డ‌లు త‌ల్లితండ్రులు వేరు వేరు చోట ఉండ‌డం వ‌ల్ల అస‌లు పిల్ల‌లు ఎలాఉంటున్నారు ఏం చేస్తున్నారు అన్న విష‌యాలు కూడా త‌ల్లి దండ్రుల‌కు పెద్ద‌గా తెలియ‌వు. వీరిలో కొంత మంది మంచిగా ఉండవ‌చ్చు మ‌రికొంత మంది చెడు వ్య‌సనాలకు లోన‌య్యే ప్ర‌మాదాలు కూడా అనేకం. 

 

అలాంటి వాటివ‌ల్ల కొన్ని సార్లు ప్రాణాలు కోల్పోయే ప్ర‌మాదాలు కూడా అనేకం. త‌ల్లిదండ్రులు రోజూ ఫోన్ చేసే బిడ్డ ఒక్క‌రోజు చెయ్య‌క‌పోయినా ఎందుకు చెయ్య‌లేదా అని ఆవేద‌న చెందేదే అమ్మ‌. మ‌రి అలాంట‌ప్పుడు ఆ బిడ్డ ఇక లేదు రాదు అని తెలిస్తే ఆ త‌ల్లి క‌డుపుకోత వ‌ర్ణ‌నాతీతం అనే చెప్పాలి. ఇలా రోజు ఎన్నో సంఘ‌ట‌నుల జ‌రుగుతుంటాయి. ఉద్యోగాలు, చ‌దువులు అంటూ ప‌ట్ట‌ణాల‌కు రావ‌డం ఏదో వ్య‌సనాలు, లేదా అల్ల‌ర్లు అంటూ కొన్ని సార్లు ప్రాణాల‌ను కోల్పోవ‌డం జ‌రుగుతుంటాయి. కాబ‌ట్టి త‌ల్లిదండ్రులు వీలైనంత వ‌ర‌కు బిడ్డ‌ల‌ను వెంట పెట్టుకుని ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: