బంగాళాదుంప ఫింగర్ చిప్స్ ఎలా చేయాలో తెలుసా? మాములుగా మనం ఫింగర్ చిప్స్ బయట కొనుక్కొని మరి తింటుంటాం.. ఆ ఫింగర్ చిప్స్ అంత రుచిగా ఉంటాయి మరి.. అలాంటి ఈ ఫింగర్ చిప్స్ ని ఇంట్లోనే చేసుకొని తినేయండి. 

 

కావలసిన పదార్థాలు... 

 

బంగాళదుంపలు - 100 గ్రా., 

 

ఉప్పు - రుచికి సరిపడా, 

 

మిరియాల పొడి - అర టీ స్పూను,

 

ఈస్ట్‌ పొడి - 3 గ్రా., 

 

గుడ్డు - 1, పాలు - 180 గ్రా., 

 

మైదా - 300 గ్రా., ఉల్లికాడలు - ఒక కప్పు, 

 

నూనె - వేగించడానికి సరిపడేంత.

 

తయారీ విధానం... 

 

బంగాళదుంపల తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి ఆవిరిపై ఉడికించి గుజ్జుగా చేయాలి. అందులో ఉప్పు, మిరియాలపొడి, గుడ్డు, పాలు వేసి కలపాలి. తర్వాత కొద్దికొద్దిగా మైదా వేస్తూ ఉండలు లేకుండా బాగా కలిపి ఒక గిన్నెలో వేసి మూతపెట్టి పక్కనుంచాలి. గంట తర్వాత అందులో ఉల్లికాడల తరుగు వేసి మరోసారి కలపాలి. ఒక ప్లాస్టిక్ కవర్ వేసి ఆ కవరును అడుగున కత్తెరతో వేలు మందం రంధ్రం చేయాలి. తర్వాత కవరును ఒత్తుతూ వేలు పొడవున మిశ్రమాన్ని నూనెలో జారవిడుస్తూ దోరగా వేగించాలి. అంతే బంగాళాదుంప ఫింగర్ చిప్స్ రెడీ అయిపోతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: