కావాల్సిన ప‌దార్థాలు:
బ్రెడ్- ఐదు స్లైసెస్
కాచిన పాలు- రెండు కప్పులు
బాదం ప‌ప్పు- ప‌ది
జీడిప‌ప్పు- కొద్దిగా

 

చక్కెర-  ఒక‌ కప్పు
నెయ్యి- పావుకప్పు
యాలకుల పొడి- అర చెంచా
కిస్మిస్- కొద్దిగా

 

త‌యారి విధానం: ముందుగా పాన్ పెట్టుకుని నెయ్యి వేసి అందులో జీడిప‌ప్పు, బాదం ప‌ప్పు మ‌రియు కిస్మిస్ ఒక్కదాని త‌ర్వాత ఒక‌టి వేసుకుని వేయించుకుని ప‌క్క‌న పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ ను ఎండలో గానీ ఫ్యాన్ గాలికి కానీ ఆరబెట్టాలి. ఎండగానే తీసి నేతిలో ముదురు రంగు వచ్చే వరకు వేయించుకొని కాచి ఆరబెట్టినా పాలలో వేసి నాననివ్వాలి. 

 

ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టుకుని అందులో పంచదారలో కొంచెం నీళ్ళు పోసి పాకం వచ్చాక అందులో యాలకుల పొడి వేసి కలిపి  పాలల్లో నానిన బ్రెడ్ స్లైసెస్ ను వేయాలి. మిశ్రమం ఉడికేటప్పుడు ఎక్కువగా కలిపితే హల్వాలాగా అయిపోతుంది గనుక కలపొద్దు. పాకం బ్రెడ్ ముక్కలకు పట్టి వాటిలోని నెయ్యి బయటికి వస్తుండగా స్టవ్ ఆఫ్ చెయ్యాలి. ఇక చివరగా నేతిలో వేయించిన జీడిప‌ప్పు, బాదం ప‌ప్పు, కిస్మిస్ లతో గార్నిష్ చేసుకుంటే డబల్ కా మీఠా రెడీ..!

మరింత సమాచారం తెలుసుకోండి: