ప్ర‌తి ఆడ‌దానికి అమ్మ‌ అనిపించుకోవాల‌నుంటుంది.  ఆడ‌వాళ్లు గ‌ర్భ‌వ‌తులుగా ఉన్నప్పుడు చాలా జాగ్ర‌త్త‌లు పాటించాలి. క‌డుపుతో ఉన్న‌ప్ప‌టి నుంచి కూడా ఆహార‌నియ‌మాలు చాలా జాగ్ర‌త్త‌లు పాటించాల్సి ఉంటుంది. పిల్ల‌లు క‌డుపులో ఉన్న‌ప్పుడు శారీర‌క అవ‌య‌వాలు ఏర్ప‌డేవ‌ర‌కు మెద‌డు సామ‌ర్ధ్యం పెర‌గ‌డానికి దోహ‌ద ప‌డుతుంది. అందుకే గర్భంతో ఉండగా కాబోయే అమ్మలు ఏమేమి తినాలి, ఏయే పదార్థాలకు దూరంగా ఉండాలో ఓ పెద్ద లిస్టు చెబుతుంటారు అటు వైద్యులు, ఇటు పెద్దలు. దీనిపై ఏళ్ల తరబడి పరిశోధనలు సైతం సాగుతూనే ఉన్నాయి. గర్భంతో ఉన్న వాళ్లు చేపలు తింతే బాగా తెలివైన పిల్లలు పుడతారని తాజాగా ఓ పరిశోధనలో వెల్లడైంది.

 

 గర్భవతులు వారానికి ఒకసారయినా చేపలను తింటే వారికి పుట్టే పిల్లలు అత్యంత తెలివితేటలతో ఉంటారని ఆ అధ్యయనం తేల్చింది. స్పెయిన్ లోని ‘పర్యావరణ సాంక్రమిక వ్యాధుల పరిశోధనా సంస్థ’ 2000 మంది తల్లులు, వారి పిల్లలను పరిశీలించారు. గర్భం దాల్చిన మూడో నెల నుంచి వారికి పుట్టిన పిల్లలకు ఐదేళ్ల వయసు వచ్చే వరకు వీరి అధ్యయనం కొనసాగింది. అందులో బలే విషయాలు వెల్లడయ్యాయి..

 

సగటున వారానికి ఓసారయినా చేపలను తీసుకున్న తల్లులకు పుట్టిన పిల్లల తెలివితేటలు (ఐక్యూ) ఎక్కువగా ఉందని వీరు గుర్తించారు. వాస్తవానికి చేపలను తినడం వల్ల పుట్టబోయే పిల్లలకు ఆరోగ్యపరగా ఎంతో మేలు జరుగుతున్నట్లు తెలిసిందన్నారు. ఈ పిల్లల్లో ఆటిజం వచ్చే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుందని కనుగొన్నారు. సో మాంసాహారులైతే కాబోయే తల్లులు ప్రతి వారం క్రమం తప్పకుండా చేపలు తింటే మంచి ప్రతిభా పాఠవాలతో కూడిన పిల్లలు పుడతారన్నమాట. అంతేకాక చేప‌ల‌ను తిన‌డం వ‌ల్ల బిడ్డ శ‌రీరం పై చ‌ర్మం బాగా రాడానికి కూడా దోహ‌ద‌ప‌డుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: