కొర్రలు.. ఎంత ఆరోగ్యమో తెలుసా.. మనం ఇప్పుడు బియ్యం వండుకొని తింటున్నాం కానీ.. ఈ బియ్యంలో కంటే కొర్రాల్లోనే శక్తి ఉంటుంది. అప్పట్లో మన పెద్దలు 50 ఏళ్ళు వచ్చిన అంత శక్తివంతంగా ఎలా ఉండేవారో తెలుసా? ఈ కొర్రలు తినే. ఇప్పుడు కూడా మనకు ఆయుర్వేద వైద్యులు కొర్రలు తినాలని సూచిస్తారు.. కానీ మనమే బాగోవు అని.. తినము. అలాంటి ఈ కొర్రలతో టేస్టీ ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో తెలుసుకోండి.. కొర్రల ఎగ్ రైస్ తినండి. 

 

కావలసిన పదార్థాలు... 

 

కొర్రలు - 100 గ్రా., 

 

గుడ్లు - 3, ఉల్లిపాయలు - 250 గ్రా., 

 

టమాట - 20 గ్రా., 

 

పచ్చిమిర్చి - 6 గ్రా., 

 

వెల్లుల్లి - 5 గ్రా., 

 

అల్లం - 5 గ్రా., 

 

నూనె - 30 మి.లీ., 

 

ఉప్పు - తగినంత.

 

తయారీ విధానం... 

 

కొర్రలను ముందుగా శుభ్రంగా కడిగి 2 గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత కుక్కర్‌లో కొర్రలతో పాటు రెండు కప్పుల నీళ్ళు పోసి కొద్దిగా ఉప్పు వేసి 3 విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించాలి. ఇప్పుడు బాండీలో నూనె పోసి తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా వేసి బాగా వేగిన తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ వేయాలి. ఇప్పుడు గుడ్లను ఒక గిన్నెలో గిలకొట్టి పై మిశ్రమంలో కలిపి వేగించాలి. తరువాత కొర్ర అన్నమును వేసి బాగా కలపాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: