ఈ రోజుల్లో భార్య చ‌నిపోగానే పిల్ల‌ల ఆల‌న పాల‌న కోసం తండ్రి వేరే పెళ్ళి చేసుకోవ‌డం అనేది స‌హ‌జం.  ఇక వ‌చ్చిన ఆ మారుడు త‌ల్లి పిల్ల‌ల‌ను క‌న్న‌త‌ల్లిలా లాలించి మంచి చెడులు చూడ‌డ‌మ‌నేది. ఎక్క‌డోగాని జ‌ర‌గ‌దు. అంత మంచి హృద‌యంతో పిల్ల‌ల‌ను ద‌గ్గ‌ర‌కు తియ్య‌డం అనేది జ‌ర‌గ‌ని ప‌ని. మ‌నం చాలా చోట్లే స‌హ‌జంగా చూసి ఉంటాం ఏదో చేసుకున్నాక త‌ప్ప‌క బాధ్య‌త‌తో ఆ పిల్ల‌ల‌ను ద‌గ్గ‌ర‌కు తీసి చూస్తారు. ఇక ఇదిలా ఉంటే... ఇద్ద‌రు పిల్ల‌ల ఓ వ్య‌క్తి భార్య ఏదో ఆనారోగ్యంతో చ‌నిపోయింది. దాంతో రెండో పెళ్ళి చేసుకున్నాడు. ఇప్పుడు ఆ పిల్ల‌ల‌కు పెళ్ళి వ‌య‌సు వ‌చ్చి సంబంధాలు వ‌స్తున్నాయి. దాంతో భ‌ర్త ఈ విషయాన్ని పెళ్ళి వారికి చెబుతుంటే పిల్ల‌లు విన్నారు. అప్ప‌టి వ‌ర‌కు తెలియ‌దు. ఆమె వాళ్ళ సొంత త‌ల్లి కాద‌ని. అంటే దీన్ని బ‌ట్టే మ‌న‌కు అర్ధం కావాలి. ఆ త‌ల్లి ఆ బిడ్డ‌ల‌ను ఎలా సాకింది అన్న‌ది. 

 

ఆమెకు వాళ్ళంటే చాలా ఇష్టం. ఈమెను కులాంతర వివాహం చేసుకున్నారట! కానీ ఆమె వాళ్ళ‌ని ప్రాణంగా చూసుకుంది. ఈ మధ్య వాళ్ళ‌కు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. తండ్రి వేరేవాళ్లతో అమ్మ గురించి చెబుతుంటే తెలిసింది. దాంతో అబ్బాయి వాళ్లకు ఆ అమ్మాయి బాగా నచ్చింద‌ని  చెప్పారు. అయితే వాళ్ళ అమ్మ మాత్రం వాళ్లింటికి రాకూడద‌ని  కండిషన్‌ పెట్టారు. మమ్మల్నే తన ప్రాణంగా చూసుకున్న అమ్మను రానివ్వవ‌ద్ద‌నడం  ఏమిట‌ని.. ఇదెక్కడి న్యాయం అనిపించింది. వెంటనే ఆమె త‌న తండ్రికి తెలియ‌కుండానే మీ సంబంధం మాకు వద్దని  ఫోన్‌చేసి వాళ్లకు చెప్పేసింది. ఇలాంటి కొన్ని సంఘ‌ట‌న‌లు వింటుంటే.. మాన‌వ సంబంధాలు ఇంకా మంట‌గ‌లిసిపోలేదు అనిపిస్తుంది. 

 

 కుటుంబంలో గాఢంగా పెనవేసుకున్న అనుబంధాల నేపథ్యంలో  అమ్మను ఇంకొకరు తక్కువ చేయడం అనేది ఆమెకు నచ్చలేదు. అయితే వాళ్ల వ్యక్తిగత అభిప్రాయాన్ని వాళ్లు వ్యక్తం చేశారు.  వ్యక్తిగత, కుటుంబ అభిప్రాయాలను మీలో మీరు చర్చించుకుని తదనుగుణంగా నిర్ణయం తీసుకోకుండానే.. ఉదాహరణకు  పెళ్లి సంబంధాల విషయంలో  కుటుంబానికి సంబంధించిన విషయాలు చివర వరకూ పక్కన పెట్టకుండా నిజాయితీగా చెప్పి. వాళ్ళ‌ మధ్య ఉన్న అనుబంధాన్ని వాళ్లకు అర్థమయ్యేలా వివరిస్తే బావుండేది. కన్నతల్లి కానంత మాత్రాన వాళ్ళ‌కు ఆమెతో గాఢమైన అనుబంధం లేకుండా లేదు కదా!? అమ్మను నా దగ్గర నుంచి మీరెలా దూరం చేస్తారు? అని ఆమె అనుకుని ఉండవచ్చు. కాబట్టి సంబంధాలు మాట్లాడుకునేటప్పుడు ఇలాంటి విషయాలు స్పష్టంగా మాట్లాడుకుంటేనే బాగుంటుంది. అప్పుడే అడుగు ముందుకు వేయడం మంచిది. ఏది ఏమైన‌ప్ప‌టికీ త‌ల్లి కాని త‌ల్లి ఇంత అపురూపంగా చూడ‌డం అనేది. అలాగే ఆ బిడ్డ‌లు కూడా ఆమెతో అంతే అప్యాయ‌త‌ను పెన‌వేసుకోవ‌డం చాలా గొప్ప విష‌యంగా చెప్పుకోవ‌చ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: