అమ్మాయిలు మిస్సింగ్ ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ అమ్మాయిల కిడ్నాపులు జరుగుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అమ్మాయిల‌ను, బాలిక‌ల‌ను ఇలా ఎన్నో మిస్సింగ్ కేసులు.. ఎక్క‌డో ఒక చోట వ‌స్తూనే ఉన్నాయి. మరింత ఆందోళనకరమైన విషయమేమంటే.. కనిపించకుండా పోతున్నవారిలో ఆచూకీ దొరకనివారి సంఖ్య ఏటేటా పెరిగిపోతోంది. ఇక ముఖ్యంగా హైదరాబాద్ నగర శివారుల్లో మిస్సింగ్ కేసులు రోజు రోజుకి ఎక్కువై పోతున్నాయి. దీంతో ఇటీవ‌ల ఎక్కువ మిస్సింగ్‌లు పోలీసుల‌కు స‌వాల్‌గా మారుతున్నాయి.

 

తమ బిడ్డ కనిపించకుండా పోతే ఆ కుటుంబం పరిస్థితి దయనీయం. త‌మ పిల్ల‌లు ఏం అయ్యారో తెలియ‌క‌.. ఎక్క‌డ వెత‌కాలో అంతుచిక్క‌కా.. పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరుగుతూ తమవారిని వెతికి పెట్టమని ప్రాధేయపడుతున్నారు. ఇక తాజాగా హాస్టల్ నుండి ఇనిస్టిట్యూట్ కి శిక్షణ నిమిత్తం వచ్చిన ఇద్దరు బాలికలు అదృశ్యం అయిన సంఘటన హైదరాబాద్ లోని మారేడిపల్లి పీఎస్ పరిధిలో జరిగింది. వివ‌రాలు చూస్తే.. హయత్ నగర్ బాస్కో ప్రేమ్ సేవాసదన్ అనాధ ఆశ్రమం నుండి గ్లోరి, కీర్తన అనే బాలికలు శిక్షణ కోసం సికింద్రాబాద్ లోని హాస్టల్‌కి వ‌చ్చారు.

 

ఇక అక్క‌డే స్థానికంగా హాస్టల్లో ఉంటూ యశోద ఫౌండేషన్ లో ఆ ఇద్ద‌రు బాలిక‌లు మూడు నెలలపాటు శిక్షణ తీసుకుంటున్నారు. ఈ మాదిరిగానే వారు ఫౌండేషన్ కు హస్టల్ నుంచి బయటకు వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. అయితే బాలికలు ఇన్ స్టిట్యూట్ కి రాకపోవడంతో అక్కడి మేనేజ్ మెంట్ హాస్టల్ కి సమాచారం ఇచ్చారు. హాస్టల్ లో కూడా వారు లేకపోవడంతో.. మారేడుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్ర‌స్తుతం కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: