మోడీ సర్కారు ప్రవేశపెట్టిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సినీ ప్రముఖులూ గళం కలుపుతున్నారు. తాజాగా.. సీఏఏ చట్టాన్ని బ్రిటీషర్లు ప్రవేశపెట్టిన రౌలత్‌ చట్టం వంటిదంటున్నారు ప్రముఖ నటి ఊర్మిళ.

 

 

ఊర్మిళను రంగీలా సినిమాతో పాపులర్ చేసింది మన రామ్ గోపార్ వర్మే అన్న సంగతి తెలుసుకదా. ఆమె ఈ పౌరసత్వ చట్ట సవరణను నల్ల చట్టంగా అభివర్ణించారు. బ్రిటీషర్లు దేశాన్ని వదలివెళ్లిన్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం దేశంలో అశాంతిని రేకెత్తించటానికి రౌలత్ చట్టం లాగే పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువచ్చిందని ఉర్మిళ వ్యాఖ్యానించారు.

 

 

నల్లచట్టాల సరసన సీఏఏకు కూడా చరిత్రలో నిలిచిపోతుందని నటి ఊర్మిళ అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ మన దేశానికే కాదు.. ప్రపంచ దేశాలన్నింటికి ఆదర్శమైన మహనీయుడని ఉర్మిళ అన్నారు. ప్రజలంతా గాంధీజీ బాటలో నడవాలని.. కానీ గాంధీ ఆశయాలను తూట్లు పొడిచేలా ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయని ఈ వర్మ హీరోయిన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: