కావాల్సిన ప‌దార్థాలు: 
పనీర్- పావుకిలో 
వెల్లుల్లి తరుగు- ఒక టీ స్పూన్‌
అల్లం తరుగు- ఒక టీ స్పూన్‌
గరం మసాలా- అర టీ స్పూన్‌

 

గడ్డపెరుగు- మూడు టీ స్పూన్లు
ఉల్లి ముక్కలు- కొద్దిగా
కారం- ఒక టీ స్పూన్‌
రెడ్ కాప్సికం - సగం ముక్క‌

 

సోంపు- ఒక టీ స్పూన్‌
ఉప్పు- రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు- కొద్దిగా
గ్రీన్ కాప్సికం- స‌గం ముక్క‌

 

త‌యారీ విధానం: ముందుగా ప‌న్నీర్‌ను చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి పెట్టుకోవాలి. మ‌రోవైపు గ్రిల్ ను వేడి చేసిపెట్టాలి. ఇప్పుడు పనీర్, కూరగాయలు, సోంపు తప్ప మిగిలినవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమంలో కోసిన పనీర్ ముక్కలు వేసి ముక్కలకు బాగా పట్టించి అరగంటపాటు ఫ్రిజ్ లో పెట్టాలి. ఇప్పుడు ఫ్రిజ్ లోని పనీర్ ముక్కల్ని తీసి సన్నని పుల్లలకు గుచ్చుతూ వాటి మధ్య కూరగాయ ముక్కలు గుచ్చాలి.

 

వీటిని వేడి గ్రిల్ మీద పెట్టుకొని సోంపు చల్లుకొని, పావుగంటపాటు ముక్కల్ని అన్నివైపులా తిప్పుతుండాలి. పనీర్ ముక్కలు వేడిగా ఉన్న గ్రిల్ కు అంటకుండా మధ్య మధ్యలో కొద్దిగా నూనె చల్లి అన్నివైపులా సమంగా కాలేలా తిప్పుతూ ఉండాలి. పనీర్ ముక్కలు స‌రిప‌డా మగ్గిన తర్వాత దించి వాటిపై కొంచెం నిమ్మరసం చల్లుకుంటే స‌రిపోతుంది. అంతే బార్బేక్యూడ్ పనీర్ రెడీ..!

 

మరింత సమాచారం తెలుసుకోండి: