తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తనకు వచ్చే పోస్టులకు త్వరగా స్పందిస్తారన్న పేరుంది. ఆయన గతంలోనూ ఇలా చాలా పోస్టులకు స్పందించి వెంటనే చర్యలకు ఆదేశించారు. ఇప్పుడు అలాంటి మరో ట్వీట్ కంటతడి పెట్టించేదిగా ఉంది.

 

 

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌ హైటెక్‌ సిటీలోని సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పనిచేస్తున్న గరిమ అనే యువతి కేటీఆర్ కు ఓ ట్వీట్ పెట్టింది. బీహార్‌లోని తూర్పు చంపారన్‌ జిల్లా రక్షాహుల్‌ జిల్లాలో ఆమె తల్లిని కొందరు కిడ్నాప్ చేశారట. ఎలాగైనా తన తల్లిని కాపాడాలంటూ ఆమె ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ కు కేటీఆర్ సానుకూలంగా స్పందించారు.

 

 

మీ తల్లిని కాపాడుతా అంటూ కేటీఆర్ బదులిచ్చారు. వెంటనే.. తెలంగాణ డీజీపీకి ఈ యువతి అభ్యర్థనను తెలియజేసారు. బీహార్ డీజీపీని సంప్రదించి, గరిమ తల్లిని ఆచూకీ కనుగొనాలని తెలంగాణ డీజీపీకి సూచించారు. తెలంగాణ డీజీపీ కూడా వెంటనే స్పందించారు.

 

 

బీహార్‌ డీజీపీకి గరిమ తల్లి కిడ్నాప్ విషయాన్ని చేరవేసి.. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గరిమ ట్వీట్‌కు కేటీఆర్‌ స్పందించి ‘మీ తల్లి సురక్షితంగా ఇంటికి తిరిగి వస్తుందని నమ్ముతున్నాను అంటూ బదులిచ్చారు. వాస్తవానికి ఎక్కడో బీహార్లో జరిగిన కిడ్నాప్ విషయంలో తెలంగాణ పోలీసుల పాత్ర పరిమితమే అయినా.. ఆయన చొరవగా స్పందించడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: