ఎయిర్ పోర్టు లో చెక్కింగ్ ఎంతో దిట్ట గా మెయింటేన్ చేస్తారు. అలాంటి చెక్కింగ్ లో చీటింగ్ చెయ్యడం కాని పని. ఎయిర్ పోర్టు సెక్యూరిటీ కళ్ళు కప్పి ఓ మహిళ ఎంతో టెన్షన్ గా వెళ్ళి పోతోంది. ఆహ్ సెక్యూరిటీ కళ్ళ నుండి తప్పించుకోవడం సాధ్యమా? నెమ్మదిగా మహిళ ని పట్టేసుకున్నారు. క్షణాల్లో అసల విషయం బయటకి వచ్చేసింది. ఏమిటి ? అసలు ఎందుకు? అని తీవ్రం గా ఆలోచిస్తున్నారా? ఉండండి చెప్తా...
 
కోటి రూపాయిల బంగారం నడుము చుట్టూ పెట్టుకుంది. ఆ మహిళ కంగారు గా వెళ్ళి పోతుంటే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. అయితే ప్రశ్నలు వేసారు. ప్రతీ దానినీ ఆచితూచి ఆలోచించారు. లోతులు అన్నింటినీ పరిశీలించగా తెలిసినది. బండారం బయట పడింది. అసలు భాగవతం వచ్చేసింది బయటకి. ఆ స్మగ్లింగ్ గురించి తెలిసి పోయింది.
 
నయా స్మగ్లింగ్ గుట్టు తేలి పోయింది. నడుము చుట్టూ అంత పెద్ద విలువ ఉన్న బంగారాన్ని పట్టుకోలేరు అని అనుకుందేమో ఆ హౌస్ కీపింగ్ లేడీ. అనుకోకుండా లేడీ అడ్డంగా దొరికి పోయింది. ఎయిర్ పోర్టు సెక్యూరిటీ అధికారులు మొత్తం 2.4  కేజీ ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఇవి విని షాక్ కి గురి అయ్యారు.
 
చెన్నై లో ఇటీవలె జరుగుతున్న స్మగ్లింగ్ లు బాగా పెరిగి పోతున్నాయి. ఇళ్ళని దాటి ఊర్లని దాటి ఏకం గా ఎయిర్ పోర్టు కి వచ్చేసారు. వివరాలకి వస్తే ఈమె పేరు విజయ కుమారి. హౌస్ కీపింగ్ విభాగం లో పని చేస్తున్న మహిళ అని తెలిసింది. కానీ చిట్ట చివర పోలీసుల కి పట్టు పడింది. జైలు కి చేరుకుంది. పోలిసులు ఎయిర్ పోర్టు నుండి జైలు కి తీసుకుని వెళ్ళారు 

మరింత సమాచారం తెలుసుకోండి: