కడప జిల్లా విషాదం చోటు చేసుకుంది. అత్తింటివేధింపులు ఒక మహిళ నిండు ప్రాణం బలైపోయింది.  జిల్లాలోని ఓబులవారిపల్లె మండలం కాకర్లవారిపల్లెలో శనివారం ఓ మహిళా ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే  మండలంలోని నాగమణి అనే మహిళకు రాజా అనే వ్యక్తితో పదేళ్లక్రితం వివాహం జరిగింది.

 

కొద్దిరోజులువీరి కాపురం సజావుగానే సాగింది.   ఆతర్వాత జీవనోపాధి కోసం భార్యాభర్తలిద్దరు కువైట్‌కు వెళ్లారు. సుమారు మూడు నెలల క్రితం నాగమణి కువైట్‌ నుంచి ఇంటికి తిరిగొచ్చింది. పెళ్ళై పదేళ్లు గడిచినా పిల్లలు పుట్టకపోవడంతో అత్తారింటి నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఈ వేధింపులు రోజు రోజుకు ఎక్కువకావడంతో నాగమణి మనస్థాపానికి గురైంది. 

 

ఈ నేపథ్యంలో రాజాకు మరో వివాహం చేసేందుకు అత్తింటి వారు ప్రయత్నించడంతో  నాగమణిని విడాకులుఇవ్వాలని వేధించారు. పిల్లల విషయంలో గతంలోనూ గొడవలు జరిగాయని తెలుస్తుంది.నాగమానికి కన్నవారు లేకపోవడంతో తనలో తానే బాధపడేది. ఈ క్రమంలో వేధింపులు తారాస్థాయికి చేరడంతో నాగమణి తీవ్ర మనస్తాపానికి గురైంది.

 

ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. అది గమనించిన స్థానికులు ఆమెను కాపాడి ఆసుపత్రికి తరలించారు. కాలిన గాయాలతో ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు నాగమణి అత్తింటి వారి పై కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: