మహిళలపై రోజు రోజుకు ఆగడాలు ఎక్కువవుతున్నాయి అన్న  విషయం తెలిసిందే.. ఈ ఘటనలు రోజు రోజుకు ఎక్కువ అన్న విషయం వేరేలా చెప్పనక్కర్లేదు.. ఎక్కడ చుసిన కూడా ఏదోరకంగా మహిళలను హింసిస్తున్నారు. కొందరు మహిళలు తమ ప్రాణాలను కోల్పోగా మరికొందరు మాత్రం తమ మానాలను ప్రాణాలను కోల్పోతున్నారు.

 

 

కొందరు తమ రుబాబు ను చూపించడాని మహిళలను హింసలకు గురిచేస్తున్నారు. వావి వరుసలు పూర్తిగా మర్చిపోయి రౌడీయిజం చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఓ మహిళా ఉపాద్యాయరాలుపై దారుణంగా ప్రవర్తించారు.. పశ్చిమ బెంగాల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది.అధికారం పేరుతో కళ్ళు మూసుకొని పోయిన వాళ్ళు సంస్కారాన్ని కూడా మర్చిపోయారు.

 

 

ఇందులో భాగంగా చాలా ఓ పాఠశాల ఉపాధ్యాయురాలిపై మగాళ్లు ప్రతాపాన్ని చూపారు.  కనికరం అనేది పూర్తిగా మర్చిపోయి మరి దారుణానికి ఒడిగట్టారు. వివరాల్లోకి వెళితే.. ఓ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిని కొందరు తాళ్లతో కట్టేసి, కొడుతూ వేధించారు. దీంతో ఆమె పోలీసులు ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే, పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ దినాజ్‌పూర్‌ జిల్లా గంగ్రామ్‌పూర్‌లో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఆ ఉపాధ్యాయురాలి భూమిని బలవంతంగా సేకరించాలని కొందరు భావించారు. అయితే, అందుకు వ్యతిరేకంగా ఆమె నిరసన తెలపడంతో కొందరు ఆమెపై దాడికి పాల్పడ్డారు.

 

 

నిందితుల్లోటీఎంసీ నేత అమల్ సర్కార్‌ కూడా ఉన్నారని తెలుస్తోంది. ఆమెను కాళ్లను తాడుతో కట్టేసి, లాక్కెలుతూ కొడుతూ దాడి చేశారు. ఈ ఘటనతో అమల్ సర్కార్‌ను టీఎంసీ అధిష్ఠానం తమ పార్టీ నుంచి తొలగించింది. ఈ ఘటనపై ఆ ఉపాధ్యాయురాలు ఐదుగురిపై ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అసలెందుకు ఇలా చేస్తున్నారు అనే వివరాలు తెలియాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: