కావాల్సిన ప‌దార్థాలు:
కాకరకాయలు- ఆర‌కేజీ
పుదీనా తరుగు- కొద్దిగా
ధ‌నియాల‌పొడి- అర టీ స్పూన్‌

 

కరివేపాకు- రెండు రెమ్మలు
మిరియాలపొడి - అర‌ స్పూన్‌
ఉప్పు- రుచికి సరిపడా

 

నిమ్మకాయ - ఒక‌టి 
నూనె- వేపుడుకు స‌రిప‌డా
కొత్తిమీర‌- కొద్దిగా

 

త‌యారీ విధానం: 
ముందుగా కాకరకాయల్ని శుభ్రంగా కడిగి చక్రాల్లా క‌ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకగిన్నెలో నిమ్మరసం పిండి, ఉప్పు కలిపి ఈ కాకరగాయ ముక్కల్ని అందులో వేసి కలిపి తీసి గంటన్నర పాటు ఎండలో ఎండనివ్వాలి. ముక్కలు ఎండకు వాడిన తర్వాత వాటిని పాన్‌లో కాచిన నూనెలో గుప్పెడు గుప్పెడు చొప్పున వేసి వేయించి పక్కన బెట్టుకోవాలి.

 

ఇప్పుడు కరివేపాకు, పుదీనా, కొత్తిమీర‌ ఆకుల్ని నూనెలో కరకరలాడేలా వేయించి కాకరగాయ ముక్కలమీద వేసి కలుపుకోవాలి. చివరగా కాకరకాయ చిప్స్ మీద మిరియాలపొడి, ధ‌నియాలపొడి చల్లుకోవాలి. అంతే కరకరలాడే కాకరకాయ చిప్స్ రెడీ. కాక‌ర‌కాయ క‌ర్రీలు ఇష్ట‌ప‌డ‌ని వారు ఇలా చేసుకుని తింటే ఖ‌చ్చితంగా ఇష్ట‌ప‌డ‌తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: