కావాల్సిన ప‌దార్థాలు:
బోన్ లెస్ చికెన్- ఒక కేజీ
పాప్రికా- నాలుగు స్పూన్లు
బార్బేక్యూ సాస్- ఒక‌ కప్పు
నిమ్మ‌ర‌సం- కొద్దిగా

 

చక్కెర-  మూడు స్పూన్లు
ఉప్పు- రుచికి స‌రిప‌డా
నీళ్లు- త‌గినంత‌
కొత్తిమీర‌- కొద్దిగా

 

త‌యారీ విధానం: ముందుగా చికెన్ ను నీళ్ల‌లో శుభ్రం చేసుకుని అంగుళం సైజులో క్యూబ్ లుగా క‌ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కోసిన చికెన్ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి కలిపి ఒక‌ గంట పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. మ‌రోవైపు పొయ్యిమీద గ్రిల్ పెట్టి పావుగంట పాటు వేడిచేయాలి. ఈ లోపు మరో గిన్నెలో పాప్రికా, చక్కెర వేసి కలిపి పక్కన బెట్టుకోవాలి.

 

ఇప్పుడు ఫ్రిజ్ లోని చికెన్ తీసి నీళ్లతో కడిగి ఆ ముక్కలకు పాప్రికా, చక్కెర మిశ్రమాన్ని పట్టించాలి. త‌ర్వాత‌ చికెన్ ముక్కలను సన్నని పుల్లలకు గుచ్చుకొని గ్రిల్ మీద పెట్టి ఐదు నిమిషాలకు ఒకసారి తిప్పుతూ సన్నని సెగ మీద ఉడికించాలి. చివరగా ముక్కలకు పైపైన బార్బెక్యూ సాస్ రాసి గ్రిల్ మీది నుంచి దించి కొత్తిమీర తరుగు, నిమ్మ చ‌ల్లుకుంటే స‌రిపోతుంది. అంతే టేస్టీ టేస్టీ చికెన్ కబాబ్స్ రెడీ..!

మరింత సమాచారం తెలుసుకోండి: