సినిమాలో నటించే అవకాశమంటారు.. ఆకర్షణీయమైన జీతంతో కూడిన ఉద్యోగమంటారు.. బంగారు భవిష్యత్తును చూపిస్తామంటారు.. చివరకు నమ్మించి వ్యభిచార రొంపిలోకి దింపుతారు. ఇటీవల నగరంలో పలుచోట్ల మసాజ్‌ సెంటర్లపైనా, స్పా సెంటర్లపైనా పోలీసులు దాడులు నిర్వహించగా అందులో ఎంద‌రో అమ్మాయిలు పట్టుబ‌డుతున్నారు. దీనిపై లోతుగా పరిశీలిస్తే వారందరిదీ ఒకటే గాథ.. అదే అందమైన జీవితాన్ని చూపించి చివరకు వ్యభిచార రొంపిలోకి దించడం. 

 

ఇక తాజాగా ఉద్యోగం పేరుతో అందమైన యువతులకు వల వేసి తీసుకొచ్చి వ్యభిచార కూపంలోకి దించుతున్న హైటెక్ ముఠా గుట్టురట్టు చేశారు బెంగళూరు పోలీసులు. నగరంలోని పలుప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఉద్యోగం పేరుతో ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి చేయిస్తున్నట్లు గుర్తించారు. ఉద్యోగం కోసం వచ్చి వేశ్యాగృహాల్లో ఇరుక్కుపోయిన పది మంది యువతులకు విముక్తి కల్పించారు. 

 

మ‌రియు ఆన్‌లైన్ యాప్‌లో అమ్మాయిల ఫొటోలు పంపి సెక్స్ రాకెట్ నడిపిస్తున్న నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. లోకాంటో వెబ్‌సైట్‌లో యువతుల ఫొటోలను అప్‌లోడ్ చేసి విటుల నుంచి వేలల్లో డబ్బులు వసూలు చేసి అమ్మాయిలను పంపుతున్నట్లు గుర్తించారు. ఈ సెక్స్ దందా నిర్వాహకులు రాజాజీనగరకు చెందిన కుమార్, బీటీఎంలేఔట్‌‌కు చెందిన భరత్‌ కుమార్, ఈజీపుర రఘు, కోడిచిక్కనహళ్లి ప్రజ్వల్‌‌ను అరెస్టు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: