సాధార‌ణంగా పెళ్లికి వ‌చ్చిన వారు వధూవరులు ఎలా ఉన్నారు.. ఎవ‌రు ఏ చీర‌లు క‌ట్టుకున్నారు.. ఎక‌రు ఏ ఆభ‌ర‌ణం వేసుకున్నారు.. ఇలాంటివి చూస్తుంటారు. అయితే ఇక్క‌డ పెళ్లిలో మాత్రం పూజారే సెంట‌ర్ ఆప్ ఎట్రాక్ష‌న్ అయ్యారు. ఎందుకో తెలియాలంటే.. లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదం. జీవితంలో ఎదగనీయకుండా చేసే అడ్గుగోడలను కూల్చిపారేయాలి. స్త్రీల‌ పట్ల వివక్ష చూపే సంప్రదాయాలను బద్దలు కొట్టాలి. ఆ పనే చేసి చూపారు ఓ మ‌హిళా పూజారి భ్రమరాంబ మహేశ్వరి.  

 

మహిళలు అన్ని రంగాలలోనూ దూసుకుపోతోన్న నేపథ్యంలో.. వేద మంత్రాల ఉచ్ఛారణతో అద్భుతంగా పెళ్లి జరిపించిన ఈ మహిళా పూజారి  అంద‌రి చూపును ఆక‌ట్టుకున్నారు. సాధారణంగా పెళ్లి తంతులో పౌరహిత్యం పురుషులే నిర్వహిస్తారు.కానీ ఓ మహిళ పెళ్లిలో పౌరహిత్యం చేస్తూ పెళ్లి చేయటం నేటి పితృస్వామ్య సమాజంలో పెద్ద విశేషమేమరి. తెలుగు అమ్మాయి సుష్మా హ‌రిని, త‌మిళ అబ్బాయి విఘ్నేశ్ రాఘ‌వ‌న్‌ల పెళ్లికి మ‌హేశ్వ‌రి పూజారిగా మార‌డం అక్క‌డ‌కి వ‌చ్చిన వారిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.  చెన్నై శివారు ప్రాంతమైన దక్షిణ చిత్రలో ఈ వేడుకను నిర్వహించారు. మైసూర్‌కు చెందిన బ్రమరాంబ వేద విద్యలో నిష్ణాతురాలు. గతంలో ఆమె ఎన్నో పెళ్లిల్లు కూడా చేశారు. 

 

వాస్తవానికి ఈ పెళ్లి కోసం మహిళా నాద‌స్వ‌ర‌, మృదంగ బృందాల‌ను ఏర్పాటు చేయాలని అనుకున్నారు. కానీ వారికి ఆ బృందాలు దొరకలేదు. కానీ, మహిళా పూజారి బ్రమరాంబ నిర్వహించిన పెళ్లి తంతు .. ఆ పెళ్లికి హాజరైన వారిని ఆకట్టుకుంది. మ‌రియు పూజారి తన మంత్రాలను ఇంగ్లీష్‌లోకి తర్జుమా చేసి ఆ దంపతులకు వివరించ‌డం మ‌రో విశేషం. దీంతో  పెళ్లికి వ‌చ్చిన అతిథులు.. పూజారి భ్రమ‌రాంబ వివ‌రాలు తెలుసుకున్నారు. తమ ఇంట్లో పెళ్లిళ్లు జరిగినప్పుడు  సంప్రదిస్తామని తెలిపారు. ఇక మహిళా పూజారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో బ్రమరాంబ ను ఆహ్వానించినట్లు పెళ్లి కూతురు సుష్మ తండ్రి సురేశ్ రెడ్డి తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: