ఫోరమ్ ఆఫ్ ఉమెన్ ఇన్ పబ్లిక్ సెక్టార్ (WIPS) తన 30 వ జాతీయ సమావేశం, వార్షిక దినోత్సవ వేడుకలను “పవర్ టు ట్రాన్స్ఫార్మ్ - డెసిషన్ టు యాక్షన్” అనే అంశంపై 11 ఫిబ్రవరి 2020 న నిర్వహించింది. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరాజన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ తమిళిసై సౌందరాజన్ మాట్లాడుతూ “మహిళలు దేశ ఆర్థిక వృద్ధికి చోదకులుగా ఎదిగారని, జాతీయ అభివృద్ధి పెరగడంలో వారి ఆర్థిక సాధికారత చాలా అవసరం”. అని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ(పిఎస్‌ఇ) లలో మహిళా ఉద్యోగులను శక్తివంతం చేయడంలో ఫోరమ్ ఆఫ్ ఉమెన్ ఇన్ పబ్లిక్ సెక్టార్ (విప్స్) పాత్రను ఆమె ప్రశంసించారు.

 

అన్ని రకాల అసమానతలకు వ్యతిరేకంగా ఒక పనిని చేయడంలో సానుకూల దృక్పథం పెంపొందించుకొని, మహిళలు తమ జీవితంలో సానుకూల వైఖరిని ప్రోత్సహించాలని ఆమె అన్నారు. విద్య, నైపుణ్యం పెంపొందించకోవడం మహిళా సాధికారతకు  పునాది అని ఆమె అన్నారు. మహిళలు తమ దైనందిన జీవితంలో అనేక రకాల సవాళ్లు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారు వాటిని అధిగమిస్తున్నారని, మహిళలకు అవకాశాలు కల్పించినప్పుడల్లా వారు దాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారని ఆమె అన్నారు. తల్లి నుండి అధికారి వరకు, మేము, మహిళలం ప్రతి పాత్రలో ఒదిగిపోతున్నామని, మహిళలు సులభంగా రూపాంతరం చెందుతారని గవర్నర్ అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్న మహిళా ఉద్యోగులను గవర్నర్ ప్రశంసించారు.

 

మానసిక మరియు శారీరక ఆరోగ్యం యొక్క అవసరాన్ని గవర్నర్ ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. శరీరాన్ని మంచి ఆకృతిలో కాపాడడమే కాకుండా, సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవాలని, యోగాని దైనందిన జీవితంలో భాగం చేయాలని ఆమె మహిళా ఉద్యోగులకు పిలుపునిచ్చారు. స్కోప్ డైరెక్టర్ జనరల్  అతుల్ సోబ్టి తన ప్రసంగంలో పిఎస్ఇలలో పనిచేసే మహిళల సామర్థ్యాలను పెంచడానికి స్కోప్ తీసుకున్న వివిధ చర్యల గురించి వివరించారు. మహిళల భాగస్వామ్యం పెరగడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సానుకూల ప్రభావాన్ని చూపుతుందని ప్రపంచవ్యాప్తంగా పరిపూర్ణత ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

 


ఈ జాతీయ సదస్సులో భారతదేశం అంతటా ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న 700 మంది విప్స్ ప్రతినిధులు పాల్గొన్నారు . కీర్తి తివారీ, ప్రెసిడెంట్ అపెక్స్ విప్స్;  సంచితా బెనర్జీ, ప్రెసిడెంట్ అపెక్స్ విప్స్;  మల్లికా ఎస్ శెట్టి, వి.పి అపెక్స్ విప్స్ మరియు అపెక్స్ విప్స్ ప్రధాన కార్యదర్శి  అంజు గుప్తా ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. గవర్నర్ విప్స్ స్మారక చిహ్నాన్ని విడుదల చేసి, ప్రభుత్వ రంగ సంస్థలలో  అత్యుత్తమ పని తీరును కనబరచిన సంస్థలకు, మహిళా ఉద్యోగుల (ఎగ్జిక్యూటివ్స్ , నాన్-ఎగ్జిక్యూటివ్స్)కు అవార్డులను అందజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: