ఇటీవ‌ల కాలంలో ఆడ‌వాళ్ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోతుంది. చదువుకునే బడి, గుడి, పనిచేసే ఆఫీసు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, ఇన్‌స్టిట్యూట్‌లు, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, బస్సులు, రైళ్లు, ఆటోలు ఇలా ఎక్క‌డా కూడా ఆడ‌వాళ్ల‌కు భద్రత, భరోసా లేకుండా పోతోంది. మహిళలు, చిన్న పిల్లలపై జరగుతున్న అత్యాచారాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నా...మరోవైపు మాత్రం అవేమి పట్టించుకోని కొంతమంది మృగాళ్లు తమపని తాము చేసుకుపోతున్నారు.  ప్రభుత్వాలు , ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నా... మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. 

 

ఆడ‌వాళ్ల‌పై దాడుల నిరోధానికి ఇప్పటికే పోక్సో చట్టం అమలులో ఉండగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకువచ్చింది. అయిన‌ప్ప‌టికీ ఎక్క‌డో ఒక చోట మాన‌వ మృగాల బారిని ఆడ‌వాళ్లు వెలుగులోకి వ‌స్తూనే ఉన్నారు. ఇక తాజాగా మహారాష్ట్రలో మరో ఘోరం జరిగింది. స్కూల్‌కి వెళ్తున్న బాలిక(15)ను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఘటన చోటుచేసుకుంది. పాఠశాలకు వెళ్తున్న బాలికను 24 ఏళ్ల యువకుడు కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. ఒంటిపై యాసిడ్ పోస్తానని బెదిరించి బాలికపైదారుణంగా  అత్యాచారానికి పాల్పడ్డాడు.

 

ఈ క్ర‌మంలోనే బాలికపై అత్యాచారానికి పాల్పడుతుండగా సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు. అత్యాచారం చేసిన ఘటన బయటకు చెబితే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడు. అయితే బాధితురాలు ధైర్యంగా ఈ విష‌యాన్ని త‌న తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న దర్యాప్తు చేప్పారు. కాగా, కాలేజీకి వెళ్తున్న లేడీ లెక్చరర్‌పై కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటన మరువక ముందే మహారాష్ట్రలో ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: