ఆలు కర్రీనే నోరు ఊరిస్తుంది.. అలాంటిది ఇంకా బిన్స్ కర్రీ ఎంత అద్భుతంగా ఉంటుంది.. అలాంటి ఆలూ బిన్స్ కర్రీ అమ్మ చేస్తే ఇంకా బాగుంటుంది.. కానీ అంతటి రుచికరమైన వంట మనం చెయ్యాలంటే చాలా కష్టం.. అందుకే ఆ ఆలు కర్రీ ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. ఆలు బిన్స్ కర్రీ రుచిని చుడండి. 

 

కావాల్సిన పదార్ధాలు.. 

 

బంగాళదుంపలు - మూడు, 

 

ఫ్రెంచ్‌ బీన్స్‌ - పావుకేజీ, 

 

జీలకర్ర - ఒక టీస్పూన్‌, 

 

ఇంగువ - చిటికెడు, 

 

పసుపు - పావు టీస్పూన్‌, 

 

కారం - అర టీస్పూన్‌, 

 

ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, 

 

గరంమసాల - అర టీస్పూన్‌,

 

ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.

 

తయారీ విధానం..

 

బీన్స్‌ను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. బంగాళదుంప పొట్టు తీసి కట్‌ చేసి పెట్టుకోవాలి. పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక జీలకర్ర వేసి వేగించాలి. తరువాత ఇంగువ వేసి, బంగాళదుంపలు వేసి కలుపుకోవాలి. కాసేపు వేగిన తరువాత బీన్స్‌ వేసుకోవాలి. మరికాసేపు వేగించాలి. ఇప్పుడు పసుపు, కారం, ధనియాలపొడి, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. మూత పెట్టి పదినిమిషాల పాటు ఉడికించాలి.చివరగా గరం మసాల చల్లుకుని మరో రెండు నిమిషాలు ఉడికించి దింపేయాలి. అంతే ఆలు బీన్స్ కర్రీ రెడీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: