కావాల్సిన ప‌దార్థాలు:
బియ్యం- పావుకేజీ
కారం- ఒకటిన్నర టీ స్పూన్‌
కుంకుమపువ్వు- కొద్దిగా

 

వెన్న- అర‌క‌ప్పు
ఉల్లిపాయలు- రెండు
టమోటాలు- ఒక‌టి
పీతలు- 100 గ్రా

 

పచ్చిమిర్చి- మూడు
పసుపు- అర టీ స్పూన్‌
ఉప్పు - రుచికి తగినంత
జీరా పొడి- ఒక టీ స్పూన్‌

 

దనియాపొడి- ఒక టీ స్పూన్‌
నెయ్యి- రెండు టేబుల్‌ స్పూన్లు
కొత్తిమీరు, పుదీనా- కొద్దిగా

 

తయారీ విధానం: ముందుగా బియ్యంలో కుంకుమపువ్వు కలిపి అన్నం వండి పక్కనుంచాలి. ఇప్పుడు కూరగాయల్ని సన్నగా తరిగిపెట్టుకోవాలి. అలాగే మ‌రోవైపు పీతలలో ఎముకల్ని తీసేయాలి. త‌ర్వాత స్టౌ మీద పాన్ పెట్టుకుని వెన్న కరిగించి ఉల్లి, మిర్చి, టమోటా, పుదీనా, కొత్తిమీర తరుగు, జీలకర్ర, కారం, పసుపు, గరం మసాల పొడులు ఒకటి తర్వాత ఒకటి దోరగా వేగించాలి. 

 

ఆ తర్వాత పీతలు, ఉప్పు వేసి సన్నని మంటపై మూతపెట్టి మగ్గించాలి. పీతలు ఉడికిన తర్వాత స్టై ఆప్ చేయాలి. ఇప్పుడు ఒక లోతైన పాత్రలో ఉడికిన అన్నం, పీత మిశ్రమం ఒకదాని తర్వాత ఒకటి లేయర్లుగా పరిచి పైన నెయ్యి, కొన్ని పుదీనా ఆకులు చల్లి మూతపెట్టి సన్నని మంటపై ప‌ది నిమిషాలు ఉంచి స్టై అఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే టేస్టీ టేస్టీ పీత‌ల బిర్యానీ రెడీ..!

మరింత సమాచారం తెలుసుకోండి: