కావాల్సిన ప‌దార్థాలు:
బేబీ కార్న్‌- పది
పసుపు- పావుటీ స్పూన్‌
జీలకర్ర పొడి- అరటీ స్పూన్‌

 

ధనియాల పొడి- ఒక టీస్పూన్‌
కారం- అరటీ స్పూన్‌
ఉప్పు- రుచికి తగినంత

 

సెనగపిండి- అర‌ కప్పు
ఛాట్‌ మసాలా- అర టీ స్పూన్‌
అల్లంవెల్లుల్లి పేస్టు- ఒక టీస్పూన్‌
నూనె- సరిపడా

 

తయారీ విధానం: ముందుగా బేబీకార్న్‌ను మీడియం సైజు ముక్కలుగా కట్‌ చేయాలి. వాటిని నీళ్లలో కాసేపు ఉడికించాలి. తరువాత నీళ్లు తీసేసి కార్న్‌ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో సెనగపిండి తీసుకొని పసుపు, కారం, ఉప్పు, అల్లంవెల్లుల్లిపేస్టు, జీలకర్రపొడి, ధనియాల పొడి, కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. 

 

అలాగే ఈ మిశ్రమం చిక్కగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఉడికించిన కార్న్‌ ముక్కలు వేసి బాగా కలియబెట్టాలి. ఆ త‌ర్వాత‌ స్టౌ మీద‌ ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఈ కార్న్‌ ముక్కలు వేస్తూ డీప్‌ ఫ్రై చేయాలి. చివ‌రిగా ప్లేట్‌లోకి తీసుకుని ఛాట్‌ మసాలా చల్లుకుని సర్వ్ చేసుకుంటే స‌రిపోతుంది. అంతే టేస్టీ టేస్టీ కార్న్ ప‌కోడి రెడీ..!

మరింత సమాచారం తెలుసుకోండి: